హోమ్ /వార్తలు /తెలంగాణ /

Komatireddy Venkat Reddy: సోనియాగాంధీ నివాసంలో కీలక భేటీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా.. కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. చర్యలు తీసుకుంటారా ?

Komatireddy Venkat Reddy: సోనియాగాంధీ నివాసంలో కీలక భేటీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా.. కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. చర్యలు తీసుకుంటారా ?

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana Congress: ఉదయం వరకు ఢిల్లీలోనూ ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ భేటీకి రాకపోవడంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థి ఎంపికపై కసరత్తు వంటి అంశాల అజెండాగా జరిగిన కీలక సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి రావాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినప్పటికీ.. ఆయన సాయంత్రం హైదరాబాద్‌కు (Hyderabad)పయనమయ్యారని తెలుస్తోంది. సోనియాగాంధీ నివాసంలో ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి, ఉత్తమ్, మధుయాష్కీ, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి వంటి నేతలు హాజరయ్యారు. అయితే ఉదయం వరకు ఢిల్లీలోనూ ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ భేటీకి రాకపోవడంపై కాంగ్రెస్ హైకమాండ్ (Congress High command)సీరియస్‌గా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కీలక సమావేశాలకు దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌ను టార్గెట్ చేస్తున్నారు.

  తనకు పార్టీలో అవమానాలు జరుగుతున్నాయని పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తాను దూరంగా ఉంటానని ప్రకటించారు. మునుగోడు(Munugodu) ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్.. ఇక్కడ పార్టీ కచ్చితంగా గెలవాలని పార్టీ నేతలకు సూచించేందుకు ఈ కీలక భేటీ ఏర్పాటు చేసింది. ఈ భేటీలోనే మునుగోడులో ఎవరెవరికి ఏయే బాధ్యతలు అప్పగించడం అనే అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య సఖ్యతను కుదిర్చే ప్రయత్నం కూడా చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది.

  అందుకే ఈ భేటీకి హాజరుకావాలని.. ఆయనకు ముందస్తుగానే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ భేటీ జరగడానికి కొద్ది గంటల ముందే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం కావడానికి ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉండాలని ముందుగానే నిర్ణయించుకున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఆయన తీరు పట్ల కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీరియస్‌గా ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే చర్చ మొదలైంది.

  Kalvakuntla kavitha : లిక్కర్ స్కాంతో నాకు సంబంధం లేదు .. ప్రతిపక్షాలపై బీజేపీ బురదచల్లడం మానుకోవాలి : కల్వకుంట్ల కవిత


  Family suicide : వ్యాపారి ఫ్యామిలీ చావుకి ఆ నలుగురే కారణం .. సూసైడ్‌ లెటర్‌లో ఏముందంటే..?


  అయితే మునుగోడు ఉప ఎన్నికలు పూర్తయ్యేవరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండకపోవచ్చనే వాదనలు కూడా ఉన్నాయి. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహరచన చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకత్వానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం తలనొప్పిగా మారినట్టు కనిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Komatireddy venkat reddy, Sonia Gandhi, Telangana

  ఉత్తమ కథలు