TS POLITICS WILL CONGRESS HIGH COMMAND TAKE ACTION AGAINST JAGGA REDDY TO SUPPORT REVANTH REDDY AK
Revanth Reddy-JaggaReddy: జగ్గారెడ్డి విషయంలో అలా జరిగితే.. రేవంత్ రెడ్డికి ఇక తిరుగులేనట్టే..
రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)
Jagga Reddy: ఒకవేళ కాంగ్రెస్ అధినాయకత్వం జగ్గారెడ్డిపై పార్టీపరంగా చర్యలు తీసుకుంటే.. రేవంత్ రెడ్డికి హైకమాండ్ నుంచి తిరుగులేని మద్దతు ఉందని భావించాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీకి సంక్షోభాలు కొత్తకాదు. వాటిని ఆ పార్టీలో పెద్దగా పట్టించుకునే వాళ్లు కూడా ఉండరు. కాంగ్రెస్‌లో అసంతృప్తి నేతలు ఎప్పుడూ ఉండనే ఉంటారు. ఎప్పటికప్పుడు తమ అసంతృప్తిని బయటపెడుతూనే ఉంటారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి తీవ్రస్థాయిలో బుసలు కొడుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) ఫైర్ అవుతున్నారు. రేవంత్ రెడ్డితోనే తన పంచాయతీ అని బహిరంగంగానే ప్రకటించారు. తనకు కాంగ్రెస్ నాయకత్వం, సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై నమ్మకం ఉందని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నిజానికి జగ్గారెడ్డిని(Jagga Reddy) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సహా ఇతర బాధ్యతల నుంచి తప్పించడంతో.. ఆయన కాంగ్రెస్(Congress) పార్టీకి గుడ్ బై చెబుతారని చాలామంది భావించారు.
కానీ జగ్గారెడ్డి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా స్పందించారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించడంతో పాటు రేవంత్ రెడ్డితోనే తన పంచాయతీ అని కామెంట్ చేశారు. దీంతో జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యిగా మారబోతున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. జగ్గారెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సహా ఇతర బాధ్యతల నుంచి తప్పించింది తెలంగాణ కాంగ్రెస్. అయితే ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం తెలంగాణ కాంగ్రెస్‌కు సాధ్యం కాదు.
ఆ పని చేయాలంటే అది కచ్చితంగా ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో ఆ పని పార్టీ అధినాయకత్వం చేస్తుందా ? అన్నది సందేహమే అని చెప్పాలి. ఒకవేళ కాంగ్రెస్ అధినాయకత్వం జగ్గారెడ్డిపై పార్టీపరంగా చర్యలు తీసుకుంటే.. రేవంత్ రెడ్డికి హైకమాండ్ నుంచి తిరుగులేని మద్దతు ఉందని భావించాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల విధేయతను ప్రకటించిన జగ్గారెడ్డిపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం చర్యలు తీసుకుంటుందని ఊహించిలేము.
అయితే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తే.. అది కాంగ్రెస్ పార్టీకి కొత్త రకమైన సవాల్‌ను సృష్టిస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి కాంగ్రెస్‌లోనే కొనసాగాలని జగ్గారెడ్డి నిర్ణయించుకోవడం వెనుక కూడా పెద్ద వ్యూహమే దాగి ఉందని.. అది కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బందిపెట్టే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.