తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ రెండు పార్టీలు కొన్నేళ్లుగా అదే రకంగా పోరాడుతున్నాయి. తెలంగాణలో(Telangana) మరో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్.. కొన్నేళ్లుగా మూడో స్థానానికి మాత్రమే పరిమితమవుతోంది. ఆ పార్టీ ఎంతగా శ్రమించినా.. డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ టీఆర్ఎస్కు తమకు మధ్యే ఉంటుందని కాంగ్రెస్ చెబుతోంది. క్షేత్రస్థాయిలో బీజేపీకి(BJP) బలం లేదని.. అదే తమకు కలిసొస్తుందనే నమ్మకంతో కాంగ్రెస్ ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) సారథ్యంలోనే ఎన్నికలు ఎదుర్కొనుంది.
ఇందుకోసం పార్టీ కార్యవర్గంలో తనకు అనుకూలంగా ఉండే వాళ్లకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర లాబీయింగ్ చేస్తున్నారు. అనేకమంది డీసీసీ చీఫ్‌ల విషయంలోనూ రేవంత్ రెడ్డి తన మాట నెగ్గించుకునేందుకు శ్రమిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేకులు వేయాలని కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వివరించారు.
పనిలో పనిగా రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై ఫిర్యాదు కూడా చేశారు. అయితే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే వారికి ఛాన్స్ ఇస్తారా ? లేక సీనియర్లు చెప్పిన వారికి అవకాశం ఇస్తారా ? అన్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో తేల్చేలా కనిపించడం లేదు. కొద్దిరోజుల క్రితమే టీపీసీసీ కొత్త కార్యవర్గాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటిస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. దీంతో డిసెంబర్ నెలలో దీనిపై ప్రకటన ఉంటుందా ? లేక దీనిపై ఏఐసీసీ నుంచి ప్రకటన వచ్చేది 2023లోనేనా అని కాంగ్రెస్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
KCR-Prakash Raj: బీఆర్ఎస్లో ప్రకాశ్ రాజ్‌కు కేసీఆర్ ఇవ్వబోయే స్థానం ఏంటి ?
KCR-BRS: ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరాలి.. కర్ణాటకలో జేడీఎస్‌కు మద్దతు ఇస్తామన్న కేసీఆర్
మరోవైపు తాము అనుకున్నట్టుగా కాంగ్రెస్ కొత్త కార్యవర్గం ఉంటే.. రేవంత్ రెడ్డి కూడా తాను అనుకున్న విధంగా టీఆర్ఎస్ , బీజేపీలను ఎదుర్కొనేందుకు ముందుకు సాగేందుకు ప్రణాళికలు వేసుకునే వీలు కలుగుతుందని కాంగ్రెస్‌లోని ఓ వర్గం చెబుతోంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ అంత తొందరగా ఏ నిర్ణయం తీసుకోదని.. కాబట్టి కొత్త కార్యవర్గం ప్రకటన ఇప్పట్లో ఉంటుందా ? అనే ప్రశ్నకు ఆ పార్టీ నేతల నుంచి సమాధానం రావడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Revanth Reddy, Telangana