Home /News /telangana /

TS POLITICS WILL CONGRESS FOCUS ON MUNUGODU BY ELECTIONS WILL BE A BIG BENEFIT FOR TRS IN TELANGANA AK

Munugodu| TRS: మునుగోడులో కాంగ్రెస్ దూకుడు.. టీఆర్ఎస్‌కు కలిసొచ్చే అంశమా ?

మునుగోడు, కేసీఆర్ (ఫైల్ ఫోటో

మునుగోడు, కేసీఆర్ (ఫైల్ ఫోటో

Munugodu Politics: మునుగోడులో పోటీ చేస్తున్న పార్టీలో టీఆర్ఎస్ అధికార పార్టీ కాగా.. బీజేపీ, కాంగ్రెస్‌లు విపక్షాలు. కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికను అంత సీరియస్‌గా తీసుకోకపోతే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా బీజేపీ అభ్యర్థికి పడే అవకాశం ఉంటుంది.

ఇంకా చదవండి ...
    రాజకీయాల్లో గెలుపు ఓటములను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. అందులోనూ పోటీ హోరాహోరీగా ఉంటే.. ప్రతి చిన్న అంశం కూడా రాజకీయ పార్టీలకు పెద్ద విషయంగా మారుతుంది. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం అంతా మునుగోడు చుట్టూనే తిరుగుతోంది. నిన్న కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ప్రకటించిన వెంటనే.. తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. త్వరలోనే తన రాజీనామాను స్పీకర్‌కు అందజేస్తానని ఆయన ప్రకటించారు. దీంతో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మునుగోడు (Munugodu)  స్థానానికి ఉప ఎన్నిక రావడం ఖాయమైంది. మునుగోడు ఉప ఎన్నికకు తాము సిద్ధమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్(Revanth Reddy) డి నిన్నే ప్రకటించారు. మరో రెండు రోజుల్లోనే కాంగ్రెస్ నేతలంతా మునుగోడుకు వెళ్లి సమరశంఖం పూర్తిస్తామని ఢిల్లీలో వ్యాఖ్యానించారు.

    దీంతో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకోనుందనే విషయం అర్థమవుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికను ఈ స్థాయిలో సీరియస్‌గా తీసుకోవడం వల్ల పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై రాజకీయవర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకోవడంతో ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందనే విషయం తేలిపోయింది. అయితే ఈ పోటీ కారణంగా అధికార టీఆర్ఎస్‌కు కొంతమేర రాజకీయ ప్రయోజనం చేకూరే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.



    మునుగోడులో పోటీ చేస్తున్న పార్టీలో టీఆర్ఎస్ అధికార పార్టీ కాగా.. బీజేపీ, కాంగ్రెస్‌లు విపక్షాలు. కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికను అంత సీరియస్‌గా తీసుకోకపోతే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా బీజేపీ అభ్యర్థికి పడే అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి అలాంటి అవకాశం ఇవ్వొద్దని పట్టుదలగా ఉంది. మునుగోడులో బీజేపీ లేదా టీఆర్ఎస్‌కు తామే ప్రధాన ప్రత్యర్థిగా ఉండాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఆ దిశగానే కాంగ్రెస్ కసరత్తు కూడా ఉండబోతున్నట్టు సమాచారం.

    Rajagopal Reddy: "రేవంత్​.. నోటికొచ్చినట్లు మాట్లాడితే బట్టలిప్పికొడుతరు”: ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి ధ్వజం

    Rajagopal Reddy: రాజగోపాల్​ రెడ్డిని ఇరుకున పెట్టిన రిపోర్టర్​.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన ఎమ్మెల్యే..

    అయితే కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎక్కువగా చీల్చితే.. అది అధికార పార్టీకి లాభం చేకూర్చేలా ఉంటుందనే చర్చ కూడా మొదలైంది. ఒకవేళ మునుగోడులో బలమైన త్రిముఖ పోటీ జరిగితే.. రాబోయే ఎన్నికల్లోనూ పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇలాంటి పోటీ ఉంటుందని అనుకోవచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా ఫోకస్ చేయడం అధికార టీఆర్ఎస్‌కు కలిసొచ్చే అంశమా లేక ఆ పార్టీకి నష్టం కలిగిస్తుందా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Komatireddy rajagopal reddy, Munugodu By Election, Telangana

    తదుపరి వార్తలు