హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR: కాంగ్రెస్ నిర్ణయం.. ఆ రకంగా కేసీఆర్‌కు కలిసొస్తుందా ?

KCR: కాంగ్రెస్ నిర్ణయం.. ఆ రకంగా కేసీఆర్‌కు కలిసొస్తుందా ?

రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ ( ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ ( ఫైల్ ఫోటో)

Telangana: కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఈసారి ఈ వేడుకల ద్వారా తమ ప్రత్యర్థులను టార్గెట్ చేయడంపైనే ఎక్కువగా ఫోకస్ చేయడానికి అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రాజకీయాల్లో పార్టీలు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయి. తాజాగా సెప్టెంబర్ 17 వేడుకల విషయంలోనూ తెలంగాణలోని(Telangana) రాజకీయ పార్టీలు ఈ విధంగా నిర్ణయాలు తీసుకున్నాయి. ఈసారి సెప్టెంబర్ 17 వేడుకలను కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఈ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారని ప్రకటించింది. అయితే బీజేపీకి(BJP) కౌంటర్‌గా ఈసారి సెప్టెంబర్ 17న సందర్భంగా జాతీయ సమైక్యతా వేడుకలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ వేడుకులను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. దీంతో సెప్టెంబర్ 17 క్రెడిట్‌ మొత్తం బీజేపీ ఖాతాలో పడకుండా.. ఆ విషయంలో తాము టార్గెట్ కాకుండా ఉండేందుకు టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం వ్యూహత్మకంగా వ్యవహరించిందనే టాక్ వినిపించింది.

  అయితే ఈ రెండు పార్టీల సెప్టెంబర్ 17 వేడుకలు జరపడం వల్ల తాము వెనుకబడిపోతామని భావించిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో స్పందించింది. ఆ రోజు తాము కూడా వేడుకులు నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు ఆ రోజు సరికొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని, తాము అధికారంలోకి వస్తే తెలంగాణవాదానికి ప్రతీకలైన పలు నిర్ణయాలను అమలు చేస్తామని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17 విషయంలో తీసుకున్న నిర్ణయం పరోక్షంగా టీఆర్ఎస్‌కు కొంతమేర కలిసి వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఒకవేళ కేవలం బీజేపీ మాత్రమే తెలంగాణలో సెప్టెంబర్ 17 వేడుకలు నిర్వహించి ఉంటే.. ఇందుకు సంబంధించిన మొత్తం పొలిటికల్ మైలేజీ ఆ పార్టీ ఖాతాలో పడేది.

  కానీ బీజేపీకి చెక్ చెప్పేందుకు సీఎం కేసీఆర్ కూడా ఈ వేడుకలను నిర్వహించేందుకు సిద్ధం కావడం.. ఈ రెండు పార్టీలకు చెక్ చెప్పే విధంగా తాము కూడా ఈ వేడుకులను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవడంతో ఇప్పుడు ఈ వేడుకలను ప్రజలు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగడంతో.. సెప్టెంబర్ 17 వేడుకల విషయంలో గతానికి భిన్నంగా ఎక్కువగా రాజకీయమే తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఈసారి ఈ వేడుకల ద్వారా తమ ప్రత్యర్థులను టార్గెట్ చేయడంపైనే ఎక్కువగా ఫోకస్ చేయడానికి అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  TRS: ఆ సీటును టీఆర్ఎస్ వదులుకోవడం ఖాయమా ?.. ఆ పార్టీకి దక్కబోతోందా ?

  TRS: మునుగోడులో టీఆర్ఎస్‌కు కొత్త కష్టాలు.. ఆ నేతలు దూరంగా ఉంటున్నారా ?

  ఇదిలా ఉంటే ఈసారి ఈ వేడుకలను తాము కూడా ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం పరోక్షంగా సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్‌కు కలిసొచ్చే అంశమనే వాదన కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సైతం ఈ వేడుకలను ఘనంగా చేయాలని అనుకోవడంతో బీజేపీ చేయబోయే వేడుకలపై తెలంగాణ ప్రజల దృష్టి తగ్గుతుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈసారి సెప్టెంబర్ 17 వేడుకలనుపై ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల ఎవరికీ ఎక్కువ పొలిటికల్ మైలేజీ వస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Congress, Telangana

  ఉత్తమ కథలు