తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు భిన్నంగా ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో ఆయన జరుపుతున్న మంతనాలు అనేక ఊహాగానాలకు తెరలేపుతున్నాయి. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతుంటే.. ఆమ్ ఆద్మీ పార్టీతో చర్చలు కేసీఆర్‌కు రెండు రకాలుగా ప్రయోజనం కలిగిస్తాయనే వాదన మొదలైంది. నిజానికి కేజ్రీవాల్‌తో (kాejriwal) సీఎం కేసీఆర్ గతంలోనే చర్చలు జరపాల్సి ఉంది. ఇందుకోసం ఆయన ఢిల్లీ కూడా వెళ్లారు. కానీ అప్పట్లో కేజ్రీవాల్ కేసీఆర్ భేటీ జరగలేదు. తెలంగాణలో ఆప్‌ను విస్తరించాలనే ఆలోచన కేజ్రీవాల్‌కు బలంగా ఉందని.. అందుకే ఆయన కేసీఆర్‌ను కలవలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.
కానీ ఈసారి కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్ (CM KCR) సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఈ ఇద్దరూ మునుపెన్నడూ లేని విధంగా దగ్గరయ్యారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే కేజ్రీవాల్‌తో కేసీఆర్ చర్చల కారణంగా టీఆర్ఎస్‌కు కలిసొచ్చే అంశాలు కొన్ని ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్‌తో సన్నిహితంగా ఉండటం కారణంగా ఆప్ తెలంగాణపై ఫోకస్ చేయడం అనేది ఇక ఉండకపోవచ్చు. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం కేజ్రీవాల్ అండ్ టీమ్ తెలంగాణలో ప్రచారం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నది మరికొందరి వాదన.
కేసీఆర్ తరహాలోనే కేజ్రీవాల్ పార్టీ కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరాన్ని పాటిస్తోంది. ఈ రెండు పార్టీలు ఆప్‌ను తమ ప్రత్యర్థిగానే భావిస్తున్నాయి. టీఆర్ఎస్ విషయంలో ఈ రెండు ప్రధాన పార్టీల వైఖరి ఇదే రకంగా ఉంది. ఇది కూడా టీఆర్ఎస్, ఆప్ కలిసేలా చేశాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేజ్రీవాల్‌తో భేటీకి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది కూడా ఓ కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
KTR | Fuel prices: కేంద్రం ఇంధన ధరల తగ్గింపుపై మంత్రి కేటీఆర్ విమర్శలు.. మోసపూరితం అంటూ వ్యాఖ్యలు
CM KCR నా శిష్యుడే -రూ.10వేల కోట్లు ఇవ్వబోయా.. నన్ను చేస్తానని వైఎస్సారే భూస్థాపితం : KA Paul
తెలంగాణలో ఆప్ బలోపేతం కోసం కేజ్రీవాల్ ఫోకస్ చేస్తే.. తమకు తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థుల సంఖ్య మరింతగా పెరిగిపోతుందనే అంచనాకు వచ్చిన కేసీఆర్.. ఈ విషయంలో ముందుగానే మేల్కొన్నారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా మంతనాలు సాగించిన కేజ్రీవాల్.. తెలంగాణలో ఆప్‌ను బలోపేతం చేయాలనే ఆలోచనలను విరమించుకుంటారేమో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aravind Kejriwal, CM KCR