హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR-Tamilisai: సీఎం కేసీఆర్, గవర్నర్ మధ్య సఖ్యత కొనసాగుతుందా ?.. ఆ రోజుతో క్లారిటీ ?

KCR-Tamilisai: సీఎం కేసీఆర్, గవర్నర్ మధ్య సఖ్యత కొనసాగుతుందా ?.. ఆ రోజుతో క్లారిటీ ?

గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana News: గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య ఈ సఖ్యత కొనసాగుతుందా ? లేదా ? అన్నది త్వరలోనే తేలిపోనుందని మరికొందరు భావిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ రాజకీయాల్లో చాలా రోజుల తరువాత అరుదైన సన్నివేశాలకు అసెంబ్లీ సమావేశాల ప్రారంభ కార్యక్రమం వేదికైంది. చాలా కాలం నుంచి ఉప్పు నిప్పుగా ఉంటున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్.. నేడు అసెంబ్లీలో ఒకరినొకరు పలకరించుకున్నారు. సీఎం కేసీఆర్(KCR) మర్యాదపూర్వకంగా గవర్నర్ తమిళిసైకు స్వాగతం పలికారు. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ తమిళిసై(Governor Tamilisai).. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని చదివారు. దీంతో ఇటు గవర్నర్ తమిళిసై, అటు సీఎం కేసీఆర్ మధ్య ఏర్పడిన గ్యాప్ తగ్గినట్టే అని.. రాబోయే రోజుల్లోనూ ఇదే రకమైన ధోరణితో ఈ ఇద్దరు ముందుకు సాగే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య ఈ సఖ్యత కొనసాగుతుందా ? లేదా ? అన్నది త్వరలోనే తేలిపోనుందని మరికొందరు భావిస్తున్నారు. ఈ నెల 17 కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ సచివాలయాన్ని(Telangana Secretariat) ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు(Tamilisai), జార్ఖండ్ ముఖ్యమంత్రులతో పాటు పలువురు ఇతర రాష్ట్రాల్లోని నేతలను కూడా ఆహ్వానించారు కేసీఆర్.

సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ సచివాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తమిళిసైను ఆహ్వానిస్తుందా ? లేక ఆమె లేకుండానే సచివాలయాన్ని ప్రారంభిస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

PM Modi Tweet: తెలంగాణపై ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టు!

తెలంగాణ అసెంబ్లీలో ముగిసిన బీఏసీ సమావేశం..6న బడ్జెట్ సహా షెడ్యూల్ ఇలా..

ఈ రోజు పరిణామాలను చూసి చాలామంది.. గవర్నర్ తమిళిసై వ్యవహారంలో కేసీఆర్ సానుకూల ధోరణితో ముందుకు సాగాలని అనుకుంటే.. సచివాలయ ప్రారంభోత్సవానికి కూడా గవర్నర్ తమిళిసైను ఆహ్వానించే అవకాశం ఉంటుందనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. అదే జరిగితే.. గవర్నర్ తమిళిసైతో సఖ్యతగా ముందుకు సాగాలని కేసీఆర్ దాదాపుగా నిర్ణయించుకున్నట్టే అనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ గవర్నర్‌ను ఆహ్వానించకుండానే కేసీఆర్ సచివాలయాన్ని ప్రారంభిస్తే.. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య కుదిరిన సఖ్యత తాత్కాలికమే అని భావించవలసి ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

First published:

Tags: CM KCR, Governor Tamilisai Soundararajan, Telangana, Telangana Budget

ఉత్తమ కథలు