Home /News /telangana /

TS POLITICS WILL CM KCR DECISIONS BENEFIT MUNUGODU EX MLA KOMATIREDDY RAJAGOPAL REDDY AK

KCR| Rajagopal Reddy: కేసీఆర్ నిర్ణయాలు.. రాజగోపాల్ రెడ్డికి కలిసొచ్చే అవకాశం ఉందా ?

సీఎం కేసీఆర్ తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి (పాత ఫొటో)

సీఎం కేసీఆర్ తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి (పాత ఫొటో)

Komatireddy Rajagopal Reddy: తన రాజీనామాతో కేవలం మునుగోడు ప్రజలకు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలందరికీ మేలు జరిగేలా కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ప్రకటించారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    రాజకీయాల్లో కొందరు తీసుకుని నిర్ణయాలు మరికొందరికి కలిసొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుందా ? అనే చర్చ మొదలైంది. మునుగోడు (Munugodu) ఉప ఎన్నిక తీసుకొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy).. తన రాజీనామా కారణంగా నియోజకవర్గానికి, నియోజకవర్గ ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉందని పదే పదే చెబుతున్నారు. తన రాజీనామా కారణంగా నియోజకవర్గానికి ఏ మాత్రం మేలు జరిగినా.. అది తనకు సంతృప్తి ఇస్తుందని వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామా తరువాత తెలంగాణ (Telangana ) ప్రభుత్వం కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది.

    అంతకముందే రైతు బీమా తరహాలో చేనేత బీమా పథకాన్ని తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మునుగోడులో ఎక్కువ సంఖ్యలో ఉండే పద్మశాలి సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకే ఈ పథకం తీసుకొచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మీడియాతో మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి. తన రాజీనామాతో తాను అనుకున్నది జరుగుతోందని.. తన రాజీనామా వృధా కాలేదని ఆయన వ్యాఖ్యానించారు. తన రాజీనామా తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని అన్నారు. తన రాజీనామా తర్వాతే చేనేత కార్మికులకు పెన్షన్‌ ప్రకటించారని. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడే నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారని వ్యాఖ్యానించారు.



    తన రాజీనామాతో కేవలం మునుగోడు ప్రజలకు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలందరికీ మేలు జరిగేలా కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ప్రకటించారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే సమయంలో నియోజకవర్గంలోని అందరు సర్పంచ్‌లకు ఫోన్లు చేస్తున్నారని ఆయన తెలిపారు. తన రాజీనామాతోనే ఫండ్స్‌ రిలీజ్‌ చేశారని.. తన రాజీనామా తర్వాత సీఎం కేసీఆర్‌ మునుగోడుకు వస్తున్నారని.. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిధులు కేటాయించలేదని.. కానీ ఉపఎన్నికల్లో గెలిచేందుకు మాత్రం వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారంటూ మండిపడ్డారు.

    TRS| Munugodu: టీఆర్ఎస్‌కు ‘మునుగోడు’ తలనొప్పి.. గతంలో లేని విధంగా.. కేసీఆర్‌కు సవాల్

    Munugodu by Elections: తెలంగాణ రాజకీయం.. మునుగోడులో పోటీకి ఆ జాతీయ పార్టీ భయపడుతోందా?

    మరోవైపు కేసీఆర్ నిర్ణయాలను తన గెలుపు కోసం వినియోగించుకునేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని.. మునుగోడులో ప్రభుత్వం ఏ రకమైన అభివృద్ధి చేపట్టినా.. సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినా.. అది తన వల్లే అని చెప్పుకునేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిద్ధమైనట్టు అర్థమవుతోంది. రాబోయే రోజుల్లోనూ ఆయన ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Komatireddy rajagopal reddy, Munugodu By Election, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు