Home /News /telangana /

TS POLITICS WILL CM KCR AGAIN PLANNING FOR EARLY POLLS SPECULATIONS RISE AFTER TUMMALA NAGESHWARA RAO COMMENTS AK

TS Politics: తుమ్మల చెప్పిన పిడుగు పడటం అంటే అదేనా ?.. కేసీఆర్ ప్లాన్ మార్చేశారా ?

సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

Telangana Politics: త్వరలోనే పిడుగు పడొచ్చని నిన్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

    తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉన్నప్పటికీ.. ముంచుకొస్తున్న ఉప ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా కారణంగా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రానుండటంతో.. ఈ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. బీజేపీ తరపున బరిలోకి దిగి గెలవాలని భావిస్తున్న రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy).. ఇందుకోసం కొంతకాలం నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఆయన బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధిస్తే.. తెలంగాణలో(Telangana) బీజేపీకి మరింత అనుకూలమైన రాజకీయ వాతావరణం ఏర్పడుతుందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది.

    అందుకే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక వచ్చేలా చేసింది. ఇదిలా ఉంటే త్వరలోనే పిడుగు పడొచ్చని నిన్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageshwara Rao) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఆయన ఎందుకు అలా అన్నారనే దానిపై సరికొత్త చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించి.. తెలంగాణలో తమ ప్రభావాన్ని మరింత పెంచుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంటే.. మునుగోడు ఉప ఎన్నికకు బదులుగా రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారనే చర్చ కూడా జరుగుతోంది.



    అలా చేయడం ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధంగా లేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మరోసారి పైచేయి సాధించి అధికారం దక్కించుకోవచ్చనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారనే అనే టాక్ వినిపిస్తోంది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన పిడుగు కామెంట్స్ కూడా ముందస్తు అసెంబ్లీ ఎన్నికల గురించేనా ? అనే వాదన బలంగా వినిపిస్తోంది. రాజకీయ వ్యూహాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహారశైలి భిన్నంగా ఉంటుంది. ప్రత్యర్థులకు అంచనాకు అందని విధంగా ఆయన తన రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతుంటారు.

    Komatireddy Venkatreddy| Bandi sanjay: బీజేపీకి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మద్దతుందన్న బండి సంజయ్​.. స్పందించిన కోమటిరెడ్డి.. ఏమన్నారంటే..?

    Telangana : సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐసీసీసీ ప్రారంభం .. ఐదు టవర్లలో నిఘా వ్యవస్థ పటిష్టం

    తెలంగాణలో ఉప ఎన్నిక తీసుకురావడం ద్వారా టీఆర్ఎస్‌ను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ భావిస్తుంటే.. తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు తీసుకొచ్చి బీజేపీకి షాక్ ఇవ్వాలని కేసీఆర్ అనుకుంటున్నారేమో అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేస్తే.. రాబోయే గుజరాత్ అసెంబ్లీతో కలిసి తెలంగాణకు ఎన్నికలకు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బీజేపీకి అత్యంత కీలక రాష్ట్రమైన గుజరాత్‌పై ఆ పార్టీ ఫోకస్ ఉంటుంది. అందులోనూ మోదీ, అమిత్ షా తెలంగాణ కంటే అక్కడే ఎక్కువగా దృష్టి పెడతారని.. అందుకే కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికల వ్యూహం గురించి ఆలోచిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana, Tummala nageshwara rao

    తదుపరి వార్తలు