Home /News /telangana /

TS POLITICS WILL CHANDRABABU NAIDU PLAN TO GET CLOSER TO BJP WILL WORK IN TELANGANA AK

Chandrababu: బీజేపీకి తెలంగాణలో ఆ అవసరం ఉందా? చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?

చంద్రబాబు, నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

చంద్రబాబు, నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

TDP-BJP: తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో టీడీపీ సహకారం లభిస్తే.. బీజేపీ బలపడే ప్రక్రియ చాలా సులువు అవుతుందని కమలనాథుల భావన. అందుకే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో టీడీపీ సహకారం తీసుకుంటే బాగుంటుందన్నది ఆ పార్టీ యోచన.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం రాజకీయ అవసరాలు మాత్రమే రాజకీయాల్లో మిత్రులు, శత్రువులుగా ఎవరు ఉండాలో డిసైడ్ చేస్తుంటాయి. ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు మిత్రులుగా ఉండి.. ఆ తరువాత శత్రువులుగా మారిపోయిన టీడీపీ, బీజేపీ.. ఆ తరువాత చాలాకాలం నుంచి దూరం దూరంగానే ఉంటున్నాయి. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu).. ప్రధాని నరేంద్రమోదీని (PM Modi) కలిశారు. దీంతో రాజకీయవర్గాల్లో సరికొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. టీడీపీ, బీజేపీలు(TDP-BJP) మళ్లీ దగ్గర కాబోతున్నారనే చర్చ జరుగుతోంది. దీనిపై స్పందించిన ఏపీలోని అధికార వైసీపీ.. చంద్రబాబు తెలంగాణలో బీజేపీకి సహకరించేందుకు సిద్ధమవుతున్నారని.. ఆ రకంగా ఏపీలో బీజేపీకి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

    అయితే ఇది సాధ్యపడకపోవచ్చని అన్నారు. కానీ వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత తెలంగాణలో బీజేపీకి టీడీపీ ఏ రకంగా సహకారం అందిస్తుందనే దానిపై చర్చ మొదలైంది. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. టీడీపీ సహకారం లేకుండానే ఆ పార్టీ బలపడుతోంది. ఇంకా పలు జిల్లాలో ఏ రకంగా బలపడొచ్చనే అంశంపై వ్యూహరచన చేస్తోంది. అయితే తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, హైదరాబాద్‌లోని ఏపీ సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బలం పుంజుకోవడంపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.



    అయితే ఈ ప్రాంతాల్లో టీడీపీ సహకారం లభిస్తే.. బీజేపీ బలపడే ప్రక్రియ చాలా సులువు అవుతుందని కమలనాథుల భావన. అందుకే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో టీడీపీ సహకారం తీసుకుంటే బాగుంటుందన్నది ఆ పార్టీ యోచన. అయితే టీడీపీ సహకారం ప్రత్యక్షంగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చంద్రబాబు, టీడీపీని బూచిగా చూపి మళ్లీ బీజేపీని టార్గెట్ చేసే అవకాశం ఉంటుందనే భావన బీజేపీ వర్గాల్లో ఉంది.

    KCR| Munugodu: టీఆర్ఎస్ ‘మునుగోడు’ రేసు.. కేసీఆర్ పరిశీలనలో మరో కొత్త పేరు ?

    BJP | Jayasudha : బీజేపీలోకి సహజనటి .. ఆ రోజునే జయసుధ పార్టీలో చేరడం ఖాయమని సంకేతాలు

    తెలంగాణలో టీడీపీ సహకారం తీసుకోవాల్సి వచ్చినా.. అది లోపాయికారిగా తీసుకోవాలే తప్ప.. నేరుగా ఆ పార్టీతో ఎలాంటి రాజకీయ పొత్తులు, సంబంధాలు పెట్టుకోకపోవడమే మంచిదని బీజేపీ భావిస్తోంది. అయితే తెలంగాణలో బీజేపీకి సహకరించేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నప్పటికీ.. టీడీపీ సహకారం తీసుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉండకపోవచ్చనే చర్చ కూడా సాగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, Chandrababu Naidu, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు