TS POLITICS WILL BJP LEADERS MANAGE JOINING IN AMIT SHAH MEETING OF MAHESHWARAM IN TELANGANA AK
Amit Shah| Telangana: రేపు తెలంగాణకు అమిత్ షా.. బీజేపీ నాయకుల ప్రయత్నాలు ఫలిస్తాయా ?
అమిత్ షా (ఫైల్)
Telangana BJP: ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరే విషయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఆయన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశమైన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి, ఆ పార్టీ ముఖ్యనేత అమిత్ షా హాజరుకానున్నారు. రేపు మహేశ్వరంలో జరగబోయే ఈ సభలో పాల్గొననున్న అమిత్ షా.. రాష్ట్ర బీజేపీ కార్యకర్తలకు, నేతలకు ఏ రకమైన సంకేతాలు, సందేశాలు ఇవ్వబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇక వరంగల్‌లో (Warangal) రాహుల్ గాంధీ సభను మించిపోయే స్థాయిలో అమిత్ షా సభకు జనసమీకరణ చేట్టాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు అమిత్ షా (Amit Shah) సభకు రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
అమిత్ షా సభకు వచ్చే జనం సంగతి ఎలా ఉన్నా.. ఈ సభ సందర్భంగా బీజేపీలో చేరబోయే నాయకులు ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. నిజానికి తెలంగాణలోని చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అమిత్ షా సభలో బీజేపీలో చేరతారని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆయన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో సమావేశమైన చర్చలు జరిపారు. బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన జితేందర్ రెడ్డితోనూ పలుసార్లు భేటీ అయ్యారు.
దీంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోవడ ఖాయమనే చర్చ జోరుగా సాగింది. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరే విషయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఆయన తెలంగాణకాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశమైన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అంతేకాదు తెలంగాణలో మరో కొత్త ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నాయకుడు బీజేపీలో చేరితే.. పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని భావించిన బీజేపీ నేతలకు ఇది ఒకరకంగా షాక్ అనే చర్చ జరుగుతోంది. దీంతో అసలు అమిత్ షా సభలో బీజేపీలో ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నేతల చేరికలు ఉంటాయా ? లేదా ? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.