దక్షిణాదిలోని తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు బీజేపీకి అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం టీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని వచ్చే ఎన్నికల్లో గెలుచుకుని తమ ఖాతాలో వేసుకుని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా అనేక వ్యూహాలకు పదునుపెడుతోంది. తెలంగాణలో(Telangana) బలపడే విషయంలో గతంలో పోల్చితే ఎంతో దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో చాలావరకు అనుకూల ఫలితాలు కూడా సాధిస్తోందని కొంతకాలంగా ఆ పార్టీకి అనుకూలంగా వస్తున్న సంకేతాలను బట్టి అర్థమవుతోంది. కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే ప్రధాని మోదీ,(PM MOdi) అమిత్ షా,(Amit Shah) జేపీ నడ్డా సహా అనేక మంది బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించి వెళ్లారు. ఇంకా అనేకమంది బీజేపీ వ్యూహకర్తలు తెలంగాణపై పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పార్టీకి మరింత ఊపు తీసుకొచ్చేందుకు ఈసారి జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో(Hyderabad) నిర్వహించాలని డిసైడయ్యింది బీజేపీ.
వచ్చే నెల మొదటి వారంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అప్పుడే సన్నాహాలు కూడా మొదలుపెట్టింది కమలదళం. తెలంగాణలో జరగబోయే ఈ సమావేశాల ద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం తమదే అనే విషయం తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని.. ఆ రకంగా ప్రజల దృష్టిని మరింత ఆకర్షించాలని బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలంగాణ బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలను ప్రొత్సహించాలని.. తద్వారా రాజకీయంగా బలపడుతున్నట్టు సంకేతాలు ఇవ్వాలని ఆ పార్టీ చాలాకాలంగా భావిస్తోంది.
అయితే చేరికల విషయంలో బీజేపీ అనుకున్నట్టు జరగడం లేదనే చర్చ సాగుతోంది. బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తుంటే.. చేరికలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఇందుకు స్థానిక నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి కారణమే చర్చ కూడా ఉంది. చేరికలను అడ్డుకోవద్దని గతంలో బీజేపీ ముఖ్యనేత బీఎల్ సంతోష్ స్థానిక నేతలకు ఓ విధంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ విషయంలో చొరవ తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
KCR| YS Jagan: జగన్ ఇచ్చిన ఛాన్స్ కేసీఆర్ ఇచ్చే అవకాశం లేదా ?.. టీఆర్ఎస్‌లో చర్చ
Vundavalli on KCR: కేసీఆర్ క్లారిటీతో ఉన్నారు.. నన్ను అలా చేయమన్నారు.. ఉండవల్లి వివరణ
కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం చేరికలను ప్రొత్సహించే విషయంలో అంతగా చొరవ తీసుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. దీంతో జాతీయ కార్యవర్గ సమావేశాల నాటికైనా పార్టీలో కొత్తగా చేరికలు ఉంటాయా ? లేక ? పెద్దగా చేరికలు లేకుండా బీజేపీ కీలక సమావేశాలు జరుగుతాయా ? అనే చర్చ జరుగుతోంది. అయితే చేరికల విషయంలో బీజేపీ అంతగా తొందరగా పడటం లేదని.. పార్టీని బలోపేతం చేస్తే ఎన్నికల నాటికి ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలు తమ పార్టీలోకి వస్తారనే ధీమాలో కమలదండు ఉన్నట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, PM Narendra Modi, Telangana