TS POLITICS WILL BJP GO WITH SLOGAN OF ONE CHANCE PLEASE IN TELANGANA STATE TO TARGET TRS AK
BJP New Slogan: తెలంగాణలో బీజేపీ సరికొత్త నినాదం.. అదే జరిగితే.. ఆ పార్టీకి అధికారం దక్కుతుందా ?
ప్రతీకాత్మక చిత్రం
Telangana Politics: రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉంటాయి. అందులో ఈ ఒక్క ఛాన్స్ కూడా ఒకటి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాజకీయ పార్టీలు ముందుగానే పసిగడితే.. ఈ ఒక్క ఛాన్స్ నినాదం బాగా పని చేస్తుందన్నది పలువురు అంచనా.
తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అధికార టీఆర్ఎస్ను దెబ్బతీస్తేనే అది సాధ్యమవుతుందని బీజేపీకి తెలియనిదికాదు. అందుకే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని.. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా మహేశ్వరం సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) కొత్త నినాదం అందుకున్నారు. తెలంగాణ ప్రజలు తమకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమకు అవకాశం ఇస్తే మంచి పాలన అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను విమర్శించడంతో పాటు తమకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరడం రాజకీయ పార్టీలకు అలవాటు.
అందులోనూ రాజకీయంగా బలపడుతున్న పార్టీలకు ఒక అవకాశం ఇచ్చేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఏపీలో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరిన వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో తెలంగాణలోనూ బీజేపీ (BJP) ప్రజల ముందుకు ఒక్క ఛాన్స్ అనే నినాదంతో వెళ్లబోతోందా ? అనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉంటాయి. అందులో ఈ ఒక్క ఛాన్స్ కూడా ఒకటి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాజకీయ పార్టీలు ముందుగానే పసిగడితే.. ఈ ఒక్క ఛాన్స్ నినాదం బాగా పని చేస్తుందన్నది పలువురు అంచనా.
తెలంగాణలో ప్రస్తుతం రాజకీయం అంతా టీఆర్ఎస్, (TRS) బీజేపీ చుట్టూనే తిరుగుతోంది. ఈ రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అన్నట్టు రాజకీయ పోరాటం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఆ పార్టీ టీఆర్ఎస్, బీజేపీలకు ఏ మేరకు పోటీ ఇస్తుందన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రెండేళ్లుగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు మాత్రం రాష్ట్రంలో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందనే సంకేతాలను ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ తమకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. మిగతా విషయాల్లో బీజేపీని టార్గెట్ చేయడంతో పాటు తమకు ఒక ఛాన్స్ ఇవ్వాలనే నినాదాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళితే ఆ ప్రభావం కొంతమేర ఉండే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.