ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లోని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాదయాత్ర చేస్తున్నారు. గత వారం రోజులుగా ఆయన పాదయాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. ఇక త్వరలోనే తాను కూడా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేస్తానని ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ప్రకటంచారు. తాజాగా తాను కూడా పాదయాత్ర చేయబోతున్నట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) వెల్లడించారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని వెల్లడించిన భట్టి విక్రమార్క.. ప్రజల్లోకి వెళ్లడానికి ఇంకా సరిపడేంత సమయం ఉందని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్‌పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై భట్టి విక్రమార్క స్పందించలేదు.
బడ్జెట్ సమావేశాల కారణంగా ఈ అంశంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో తాను చూడలేదని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అనడం అవివేకమని భట్టి విక్రమార్క అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి సభలో కేసీఆర్ వాస్తవమే మాట్లాడారని చెప్పారు. కాళేశ్వరంతో పాటు అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనలేదని.. త్వరలోనే తనతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే ఆయన పాదయాత్రలో పాల్గొంటామని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత లేదనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. ఈ ఊహాగానాలకు ఊతమిచ్చే విధంగా రేవంత్ రెడ్డి పాదయాత్రలో ఇప్పటివరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు, మెజార్టీ ఎమ్మెల్యేలు పాల్గొనలేదు. బడ్జెట్ సమావేశాల కారణంగానే రేవంత్ రెడ్డి పాదయాత్రకు దూరంగా ఉన్నామని ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ.. ఆయనతో ఉన్న విభేదాల కారణంగానే చాలామంది కాంగ్రెస్ నేతలు ఆయన పాదయాత్రకు దూరంగా ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Summer Holidays: తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు.. ఎప్పటినుంచి అంటే.. ?
CM KCR | Kondagattu: సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా..కారణం ఇదే!
ఈ క్రమంలోనే తాజాగా భట్టి విక్రమార్క తాను కూడా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. భట్టి విక్రమార్క ప్రకటన నేపథ్యంలో మిగతా కాంగ్రెస్ నేతలు సైతం ఇదే విధంగా పాదయాత్రకు సంబంధించిన ప్రకటనలు చేస్తారేమో అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhatti Vikramarka, Telangana