హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics: ఒక్కప్పుడు కేసీఆర్​కు కలిసొచ్చిన జిల్లా.. నేడు ఇంటి పోరు తప్పడం లేదు..

Telangana Politics: ఒక్కప్పుడు కేసీఆర్​కు కలిసొచ్చిన జిల్లా.. నేడు ఇంటి పోరు తప్పడం లేదు..

KCR TRS(FILE)

KCR TRS(FILE)

సింహ గర్జన నుంచి ' తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో ' అని నినదించి ఆమరణ దీక్ష వరకు సెంటిమెంట్ గా కలిసొచ్చిన కరీంనగర్ నుంచే కార్య కలాపాలు ప్రారంభించారు . అయితే అదే జిల్లాకు చెందిన కేసీఆర్ కుటుంబ సభ్యులే ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతుండటం గమనార్హం

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (Srinivas, P, News18, Karimnagar)

  ఉమేష్ రావు (Umesh rao), రమ్యారావు (Ramya Rao). తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ (KCR) అడుగు జాడల్లోనే నడిచారు . తరువాత వేరు దారుల్లో ప్రయాణిస్తున్నారు. ఇంటి పార్టీని కాదని వేరే పార్టీలో చేరి తమ వ్యతిరేకతను వెలిబుచ్చుతున్నారు . ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్​తోనే ఉన్న రెండు కుటుంబాలు.. విభేదించి మరీ వేరే పార్టీలో చేరడం సంచలనం కలిగించింది . గులాబీ జెండాను వీడిన ఆ ఇద్దరు మాత్రం నేటికీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు . పార్టీలో చాణక్య నీతిని ప్రదర్శి స్తున్న సీఎం సొంత కుటుంబం నుంచి వస్తున్న వ్యతిరేకతను మాత్రం తగ్గించుకోలేకపోతున్నారు .

  ఇక్కడ కూతురు..

  సీఎం కేసీఆర్ అన్న రంగారావు కూతురు రమ్యారావు టీఆర్ఎస్ (TRS) పై తిరుగుబావుటా ఎగురేశారు . పార్టీ ఆవిర్భావం నుంచి బాబాయ్ బాటలోనే నడిచిన రమ్యారావు కుటుంబం పార్టీ విధాన నిర్ణయాల్లోనూ పాలు పంచుకున్నారు . తీగలగుట్టపల్లిలో ఉత్తర తెలంగాణ భవన్ నిర్మాణం జరిగే వరకూ రమ్యారావు ఇంట్లోనే ఉంటూ కేసీఆర్ సమీకరణాలు చేసేవారు . ఆమె భర్త మధుసూధన్ రావు టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్​ మెంబర్​గా , రాష్ట్ర ఉపాధ్యక్షులుగా , మీడియా ఇన్​చార్జిగా , కరీంనగర్ లోకసభ ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు . అయితే 2012 లో టీఆర్ఎస్ ను వీడిన రమ్యారావు టీఆర్ఎల్ డీ మహిళా విభాగం రాష్ట్ర అధ్య క్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు . 2014 లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె టీపీసీసీ నాయకురాలిగా పని చేశారు . వచ్చే ఎన్నికల్లో తనకు కరీంనగర్ టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ముందు ఉంచారు .

  ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలిని తీవ్రంగా వ్యతిరేకించే రమ్యారావు తనకు అవకాశం ఇస్తే సత్తా చాటుతానని అంటున్నారు . ఈమె తనయుడు రితీష్ రావు కూడా  ఎన్ ఎస్ యూ ఐలో రాష్ట్రస్థాయి నాయకునిగా పలు ఆందోళనల్లో పాల్గొంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ వైఖరిని ఎండగడుతున్నారు.

  అక్కడ మేనల్లుడు ..

  టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి మేనమామతోనే ఉన్న చీటి ఉమేష్ రావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి  (YSR) ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు పార్టీని వీడారు . రాజన్న సిరిసిల్ల జిల్లా పదిరకు చెందిన ఉమేష్ రావు 2001 నుంచి కేసీఆర్ వెంటే ఉంటూ పార్టీలో అన్నీ తానై వ్యవహరించారు . 2004 ఎన్నికల తరువాత టీఆర్ఎస్ (TRS) ను వీడిన ఉమేష్ రావు కేసీఆర్ కు వ్యతిరేకంగా గళం ఎత్తారు . కేసీఆర్ (KCR) లక్ష్యంగా ఉమేష్ రావు చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు . ఈ నేపథ్యంలో పలుమార్లు ఉమేష్ రావు సిరిసిల్ల టికెట్ ఆశించినప్పటికీ రాజకీయ సమీకరణాల వల్ల చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థిని ప్రకటించింది . ఇటీవల కాలంలో రాజకీయాలకు దూరంగా ఉన్న ఉమేష్ రావు పేరు మరోసారి తెరపైకి వచ్చింది .

  YS Sharmila: మంత్రి మరదలు అని మాట్లాడొచ్చా? గమ్మునుండాల్నా?:  వైఎస్​ షర్మిల

  తాజాగా ఆయన ఏఐసీసీ , పీసీసీ నాయకులను కలిసి మనుసులో మాట చెప్పుకున్నారని టాక్​. ఆయన సిరిసిల్ల (Siricilla) నుంచి టికెట్ ఆశిస్తు న్నారు . వచ్చే ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే బావమరిది కేటీఆర్ పై పోటీ చేస్తానని చెప్తున్నారు . సీఎం కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా బరిలో నిలుస్తానని ఉమేష్ రావు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది . ఇప్పటికే సిరిసిల్ల టికెట్ కేకే మహేందర్ రెడ్డికి ఇస్తానన్న సంకేతాలను పీసీసీ చీఫ్ ఇచ్చినప్పటికీ తాజాగా ఉమేష్ రావు రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుం టుందోనన్న చర్చ మొదలైంది .

  కేసీఆర్​ సెంటిమెంట్ జిల్లాలోనే ..

  ఉద్యమ సమయం నుంచి తనకు అచ్చొచ్చిన జిల్లా కరీంనగర్ (Karimnagar) అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తుంటారు . సింహ గర్జన నుంచి ' తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో ' అని నినదించి ఆమరణ దీక్ష వరకు సెంటిమెంట్ గా కలిసొచ్చిన కరీంనగర్ నుంచే కార్య కలాపాలు ప్రారంభించారు . అయితే అదే జిల్లాకు చెందిన కేసీఆర్ కుటుంబ సభ్యులే ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతుండటం గమనార్హం . ఓ వైపున తన అన్న కూతురు , మరోవైపున అక్క కొడుకు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి టీఆర్ఎస్​కు వ్యతిరేకంగా పనిచేస్తుండడం చర్చనీయాంశంగా మారింది .

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Karimnagar, Telangana Politics, Trs

  ఉత్తమ కథలు