Home /News /telangana /

TS POLITICS WHY DID THOSE SENIOR LEADERS WHO HAD MADE THEIR POLITICAL PRESENCE GOOD IN JOINT ANDHRA PRADESH REMAIN SILENT FOR SEVEN YEARS NZB PRV

Telangana Politics: ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్​లో చ‌క్రం తిప్పిన సీనియ‌ర్ నాయ‌కులు.. ఎందుకు సైలెంట్ అయ్యారు.?

డీఎస్​, సురేశ్​, మండవ (ఫైల్​)

డీఎస్​, సురేశ్​, మండవ (ఫైల్​)

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్​లో ఏళ్లుగా రాజకీయాలను శాసించిన పలువురు నాయకులు ప్రత్యేక రాష్ట్రం వచ్చాక స్తబ్దుగా మారిపోయారు. అసలు వాళ్ల ఉనికే లేనట్లుగా తయారయ్యారు.

  (P. Mahendar, News18, Nizamabad)

  తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతుండటంతో రాష్ట్రంలో రాజ‌కీయ పార్టీలు అన్ని వారి బ‌ల బ‌లాల‌ను బేరిజు వెసుకుంటున్నాయి. ఇదే అదునుగా సీనియ‌ర్ లీడ‌ర్లు వారి రాజకీయాలకు పదును పెట్టే ప‌నిలో ఉన్నారు. అయితే ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh)లో ఏళ్లుగా రాజకీయాలను శాసించిన పలువురు నాయకులు ప్రత్యేక రాష్ట్రం వచ్చాక స్తబ్దుగా మారిపోయారు. అసలు వాళ్ల ఉనికే లేనట్లుగా తయారయ్యారు. వీరిలో ముఖ్యంగా నిజామాబాద్ (Nizamabad) జిల్లా నుంచి  డి. శ్రీనివాస్ (డీఎస్), మండ‌వ వెంక‌టేశ్వ‌ర్ రావు, కే ఆర్ సురేష్ రెడ్డి (K Suresh reddy)లు ఉన్నారు. ద‌శ‌బ్దాల పాటు తెలంగాణ (Telangana)లో  కీల‌క ప‌ద‌వుల్లో ఉన్నారు.. ఏపీ రాజ‌కీయాల్లో కీలకంగా వ్య‌వ‌హ‌రించారు..  ఆయా పార్టీలను నిలబెట్ట‌డంలో వీరి పాత్ర చాలా ఉంది.

  రెండో సారీ ఎమ్మెల్సీ ద‌క్కక‌పోవ‌డంతో..

  డీ. శ్రీనివాస్​. ఉమ్మడి ఏపీలో  పీసీసీ  చీఫ్​గా రెండు సార్లు పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్  (Congress)ను అధికార పీఠం పై కూర్చోబెట్టి తన ప్రాబల్యాన్ని చాటుకున్నారు. సోనియా గాంధీ విధేయుడిగా జాతీయ రాజ‌కీయాల్లోనూ త‌న అనుభ‌వాన్ని పార్టీ కొసం ఉప‌యోగించారు. కానీ మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో అనుహ్యంగా పార్టీ మారారు. హ‌స్తంను వీడి గులాబీ గూటికి చేరారు. రెండో సారీ ఎమ్మెల్సీ ద‌క్కక‌పోవ‌డంతో మ‌న‌స్తాపానికి గురైన డీఎస్ టీఆర్ఎస్ (TRS) లో చేరి తెలంగాణ ప్రభుత్వానికి స‌ల‌హాదారుడిగా ప‌నిచేశారు. ఆ త‌రువాత రాజ్యస‌భ‌కు ఎన్నిక‌య్యారు. అయితే టీఆర్ఎస్ ఆయ‌న ప‌క్క‌న పెట్టింది.  రాజ్య‌స‌భ‌ ప‌దవీ కాలం పూర్తి అయింది

  ఒక‌ప్పుడు నిజామాబాద్ జిల్లాలో తిరుగు లేని నేత‌గా ఎదిగిన డీఎస్ (DS).  ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్న‌ట్లుగా వార్తలు వ‌చ్చినా కార్య‌రూపం దాల్చలేదు.. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల నాటిని డీఎస్ను మళ్లీ బ‌రిలో ఉంటారా .. ఉంటే ఎక్క‌డి నుంచి పోటి చేస్తారు..? ఎవరూ చెప్పలేని ప్రశ్నలే.

  ఎన్టీఆర్, చంద్రబాబుల‌కు కుడి భుజం..

  ఇక ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో మండ‌వ వెంక‌టేశ్వ‌ర్ రావు (Mandava Venkateswar rao) ఉన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబుల‌కు కుడిభుజంగా ఉండేవారు ఆయన.. నిజామాబాద్ జిల్లాకు పెద్ద దిక్కుగా గుర్తింపు పొందారు. తన సామాజిక వర్గానికి అండ‌గా నిలిచారన్న పేరు ఉంది. తెలంగాణలో టీడీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి సైలెంట్​గా ఉన్నారు మండవ . 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు..  పాత స్నేహంతో సీఎం కేసీఆర్ నేరుగా మండవ ఇంటికి వెళ్ళి మంతనాలు జరిపి గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్‌కు మండవకు మంచి స్నేహం ఉండటంతో కాదనలేకపోయారు. దీంతో సైకిల్ దిగి కారేక్కశారు.

  కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న సురేష్ రెడ్డి.. నాలుగు ప‌ర్యాయాలు వ‌రుస‌గా MLAగా గెలిచారు.. స్పీక‌ర్ గా కూడా ప‌ని చేశారు.. 2009, 2014 లో ఓట‌మి పాల‌య్యారు.. అటు కేఆర్ సురేష్ రెడ్డి, ఇటు మండవ ఇద్దరూ కారెక్కడంతో పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపు ఖాయం అనుకున్నారు అందరూ..  కానీ  సీఎం కుతూరు  కవిత ఓట‌మి పాల‌య్యారు. ఈ ఓట‌మితో మండ‌వ రాజ‌కీయ భ‌విష్యత్తు తారుమారైంది.. ఎంపీగా క‌విత‌ను గెలిపించి ఉంటే సీఎం కేసీఆర్ పై ఒత్తిడి పెంచి త‌న‌కు ఎదైనా ప‌ద‌వి కావాల‌ని అడిగేవారు.. కానీ ఓట‌మి కార‌ణంగా ఏం చేయ‌లేని ప‌రిస్థితి. దీంతో రాజకీయ భవిష్యత్‌ అంధకారంలో పడింది.

  కానీ అనుహ్యంగా సురేష్ రెడ్డికి  రాజ్యసభ సీటిచ్చేశారు కేసీఆర్​.  అయితే తాజాగా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వీరు బ‌రిలో నిలిచేందుకు అనుచ‌రుల‌తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.. బ‌రిలో దిగితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.?. అది ఎంత వ‌ర‌కు సాధ్యం అవుతుందో తెలియాలి. అన్నిక‌లిసి వ‌స్తే సీనియర్ నాయ‌కులు మ‌రో సారి ఓ వెలుగు వెలిగే అవకాశమూ లేక‌పోలేదని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Nizamabad, Telangana Politics, TRS leaders

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు