Home /News /telangana /

TS POLITICS WHY DID KA PAUL SUDDENLY COME INTO TELANGANA POLITICS AGAIN AND WHO BROUGHT HIM HERE THE STORY BK PRV

KA Pual: తెలంగాణ‌లో కేఏ పాల్ స‌డెన్ ఎంట్రీకి కార‌ణాలేంటీ? పాల్ వెనుక ఉన్న‌దేవ‌రు?  పాల్​కు తెలంగాణ‌లో ఏంట్రీ ఇప్పించ‌డం వెనుక ఆ పార్టీ హ‌స్త‌ముందా? 

కేఏ పాల్ (ఫైల్​)

కేఏ పాల్ (ఫైల్​)

కేఏ పాల్ మ‌ళ్లీ తెలంగాణ రాజ‌కీయ‌ల్లో ప్ర‌త్యక్ష‌మైయ్యారు. తెలంగాణతోపాటు ఏపీలో కూడా కేసీఆర్, జ‌గ‌న్ ముంద‌స్తుకు వెళతార‌ని ఉహాగానాలు ఉన్న నేప‌థ్యంలో కేఏ పాల్ తెలంగాణ రాజ‌కీయాల్లో హాల్ చ‌ల్ చేస్తుండ‌టంతో ఇప్పుడు మ‌ళ్లీ కేఏ పాల్ చ‌ర్చ‌నీయాంశంగా మారారు.

ఇంకా చదవండి ...
  (M. BalaKrishna, Hyderabad, News18)

  కేఏ పాల్ (KA Paul)ఈ పేరుకు పెద్దగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. .శాంతి దూత‌గా ఎంత మందికి కేఏ పాల్ తెలుసో తెలీదొ కాని పొలిటిక‌ల్​గా ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న గురించి తెలియ‌ని వాళ్లు ఉండారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే సోష‌ల్ మీడియాలో ఆయ‌న క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న ఏం మాట్లాడినా అంద‌రూ ఆస‌క్తిగా చూస్తారు. ఆయ‌న ఇచ్చే పొలిటిక‌ల్ స్పీచ్ ల‌కు వ్యూస్ కోట్ల‌లో ఉంటాయి. అందుకే తెలుగు న్యూస్ చాన‌ల్స్ అన్ని ఆయ‌న్ని త‌మ స్టూడియోలో కూర్చోపెట్టుకొని ఎందో ఒక అంశంపై మాట్లాడించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాయి. 2019 ఎన్నిక‌ల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తానని హాడావిడి చేసిన కేఏ పాల్ త‌రువాత పోటీలోనే లేకుండా వెళ్లిపోయారు. అయితే తాజాగా మ‌ళ్లీ కేఏ పాల్ తెలంగాణ రాజ‌కీయ‌ల్లో ప్ర‌త్యక్ష‌మైయ్యారు (KA Paul entry in Telangana). తెలంగాణతోపాటు ఏపీలో కూడా కేసీఆర్, జ‌గ‌న్ ముంద‌స్తుకు వెళతార‌ని ఉహాగానాలు ఉన్న నేప‌థ్యంలో కేఏ పాల్ తెలంగాణ రాజ‌కీయాల్లో (Telangana Politics) హాల్ చ‌ల్ చేస్తుండ‌టంతో ఇప్పుడు మ‌ళ్లీ కేఏ పాల్ చ‌ర్చ‌నీయాంశంగా మారారు.

  పెద్ద మాస్ట‌ర్ ప్లానే ఉంద‌ని..

  పాల్​ అమెరికా నుంచి వ‌చ్చి రావ‌డంతోనే కేసీఆర్ (CM KCR) పైనే నిప్పుడు చెర‌గ‌డం ప్రారంభించారు. బంగారు తెలంగాణ సాధ్యం నాతోనే అంటూ ప్రెస్ మీట్ ల మీద ప్రెస్ మీట్ లు పెట్ట‌డం ప్రారంభించారు. అయితే  తెలంగాణ లో కేఏ పాల్ ఈ స‌డెన్ ఎంట్రీ (Entry) వెనుక ఒక పెద్ద మాస్ట‌ర్ ప్లానే ఉంద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో బీజేపీ బ‌లంగా ఉంది కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో కాస్త పుంజుకుంద‌నే చెప్పుకోవాలి. మ‌రోక వైపు తాజాగా పీకే కేసీఆర్ కు ఇచ్చిన రిపోర్ట్ లో అధికార పార్టీకి కేవ‌లం 25 నుంచి 30 స్థానాలు మాత్ర‌మే వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పిన‌ట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల సమాచారం. వీట‌న్ని నేప‌థ్యంలో కేఏ పాల్ ను అధికార పార్టీ నేత‌లే ప‌క్కా రాజ‌కీయ వ్యూహాంతో తెలంగాణ‌లోకి తీసుకొచ్చార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు కొంత మంది అనుమానిస్తోన్నారు.

  ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును ప‌క్క‌దారి ప‌ట్టించొచ్చ‌ని?

  వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోరు త్రిముఖంగా ఉన్న నేప‌థ్యంలో కేఏ పాల్ ను మ‌ధ్య‌లో బ‌రిలో ఉంచితే కొంత మేర‌కైన ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును ప‌క్క‌దారి ప‌ట్టించొచ్చ‌ని ఆలోచ‌న‌లో అధికాపార్టీ నేత‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కేసీఆర్ కేఏ పాల్​ను త‌న‌కు వ్య‌తిరేకంగా తెలంగాణ‌లో ప్ర‌చారం చేయ‌డానికి తీసుకొచ్చి ఉంటారనే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ప్ర‌స్తుతం కేఏపాల్ స‌భ‌కు అనుమ‌తి నిరాక‌రించ‌డం, అత‌ని పై దాడి చేయించ‌డం కూడా అధికార‌పార్టీ స్క్రిప్ట్​లో భాగామ‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తోన్నాయి.

  అయితే తెలంగాణ‌లో కేఏ పాల్ ఎజెండా ఏంట‌నే దానిపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతుంది. బంగారు తెలంగాణ అనే నినాదం మ‌రి 2019 లో ఎక్క‌డికి వెళ్లిపోయింద‌ని అప్పుడు ఎందుకు ఇక్క‌డ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌తిప‌క్ష పార్టీల నేతలు. కేవ‌లం ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌డానికి కేసీఆర్ ఆడిస్తున్న డ్రామాలు ఇవ‌న్ని అని వారంతా అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Ka paul, Telangana Politics

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు