హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఆ మూడు పదవుల విషయంలో కేసీఆర్ ఆలోచన ఏంటి ?.. మళ్లీ అలా చేస్తారా ?

Telangana: ఆ మూడు పదవుల విషయంలో కేసీఆర్ ఆలోచన ఏంటి ?.. మళ్లీ అలా చేస్తారా ?

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

TRS: రాజ్యసభ సీట్లకు అభ్యర్థులకు ఎంపిక చేసే విషయంలో కేసీఆర్ కాస్త భిన్నంగా ఆలోచిస్తుంటారు. రేసులో లేని వారిని తెరపైకి తీసుకొచ్చి.. ఆ పదవులను కట్టబెట్టిన సందర్భాలు ఉన్నాయి.

  మరికొన్ని నెలల్లోనే టీఆర్ఎస్ తరపున ముగ్గురు రాజ్యసభ నుంచి రిటైర్ కాబోతున్నారు. వీరి స్థానంలో కొత్తవారికి ఛాన్స్ రాబోతోంది. ఈ మూడు స్థానాలు టీఆర్ఎస్‌కే దక్కనుండటంతో.. వీరిలో ఎవరికి ఛాన్స్ వస్తుందనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్(TRS) తరపున ఈ మూడు సీట్ల కోసం రేసులో అనేక మంది ఉన్నారు. మాజీ ఎంపీ వినోద్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా పదిమందికి పైగా ఈ స్థానాల కోసం రేసులో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఎవరి వైపు మొగ్గు చూపుతారనే అంశంపై మాత్రం ఎవరికీ క్లారిటీ రావడం లేదు. రాజ్యసభ (Rajya Sabha) సీట్లకు అభ్యర్థులకు ఎంపిక చేసే విషయంలో కేసీఆర్ కాస్త భిన్నంగా ఆలోచిస్తుంటారు. రేసులో లేని వారిని తెరపైకి తీసుకొచ్చి.. ఆ పదవులను కట్టబెట్టిన సందర్భాలు ఉన్నాయి.

  బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ వంటి వారు ఈ కోవలోకే వస్తారని చెప్పొచ్చు. దీంతో టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎంపిక కాబోయే అభ్యర్థుల విషయంలో సీఎం కేసీఆర్ మరోసారి ఇదే రకమైన నిర్ణయం తీసుకుంటారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో రాజ్యసభలో సంఖ్య కీలకంగా మారనుంది. కాబట్టి పార్టీకి, తనకు విధేయులుగా ఉన్నవారినే పెద్దల సభకు ఎంపిక చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

  అలా చూస్తే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేస్తూ, సీఎం కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరిగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్‌కు రాజ్యసభ సీటు దక్కడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సీట్లకు అభ్యర్థుల ఎంపిక చేసే విషయంలో సామాజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండటంతో..కేసీఆర్ వాటిని బేరిజు వేసుకుని నాయకులకు ఛాన్స్ ఇస్తారనే చర్చ జరుగుతోంది.

  Revanth Reddy-JaggaReddy: జగ్గారెడ్డి విషయంలో అలా జరిగితే.. రేవంత్ రెడ్డికి ఇక తిరుగులేనట్టే..

  Telangana Politics: కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరి దారి వాళ్లు చూసుకున్నారా ?.. ఆ మాటలకు అర్థమేంటి ?

  రాజ్యసభకు దళితుల కోటాలో తనకు కేసీఆర్ కచ్చితంగా అవకాశం ఇస్తారని మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే కేసీఆర్ ఈ కోటాలో మోత్కుపల్లికి ఛాన్స్ ఇస్తారా ? లేక మరొకరిని ఎంపిక చేస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక బీసీ కోటాలో కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారన్నది కూడా ఉత్కంఠగా మారింది. అయితే ఈ సీట్ల భర్తీకి ఇంకా సమయం ఉండటంతో.. అప్పటి పరిస్థితిని బట్టి సీఎం కేసీఆర్ అభ్యర్థులను ఎంపిక చేస్తారని కొందరు చర్చించుకుంటున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు