హోమ్ /వార్తలు /తెలంగాణ /

MLA Rajasingh: శిక్ష అనుభవించాల్సిందేనా ..? బెయిల్‌పై బయటకు వచ్చేనా ..? రాజాసింగ్‌ ఇష్యూపైనే సర్వత్రా చర్చ

MLA Rajasingh: శిక్ష అనుభవించాల్సిందేనా ..? బెయిల్‌పై బయటకు వచ్చేనా ..? రాజాసింగ్‌ ఇష్యూపైనే సర్వత్రా చర్చ

రాజాసింగ్​ (File Photo Credit:Twitter)

రాజాసింగ్​ (File Photo Credit:Twitter)

MLA Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విషయంలో న్యాయస్థానం ఎలా వ్యవహరించనుందనే చర్చ జరుగుతోంది. పీడీ యాక్ట్ నమోదు చేసిన ఆయన జైలు శిక్ష గడవాల్సిందేనా లేక బెయిల్‌పై బయటకు వస్తారా అన్నది హాట్‌ టాపిక్‌గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్టైన గోషామహల్ ఎమ్మెల్యే(Goshamahal MLA)రాజాసింగ్‌ విషయంలో న్యాయస్థానం ఎలా వ్యవహరించనుందనే చర్చ జరుగుతోంది. పీడీ యాక్ట్ (PD Act)నమోదు చేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాలనుకుంటున్న ఎమ్మెల్యేకి ఈకేసులో ఉపశమనం లభిస్తుందా లేక జైలు జీవితం అనుభవించాల్సిందేనా అనే టాపిక్‌ నడుస్తోంది.అనే చర్చ ఈపరిణామాల నేపధ్యంలోనే చర్లపల్లి జైల్లో ఉన్న రాజాసింగ్‌(Rajasingh)ని ములాఖత్‌Mulakatలో న్యాయవాదులు, కుటుంబ సభ్యులు కలవడం జరిగింది. అయితే అడ్వైజరీ బోర్డు(Advisory Board)నిర్ణయం ప్రకారమే ఆయనకు జైలుశిక్ష(Imprisonment)పడుతుందా లేక బెయిల్‌(Bail)పై విడుదల అవుతారా అనే విషయం తేలుతుంది.


Harish rao: సీబీఐ నోటీసులొస్తాయని బీజేపీ ఎంపీలు ఎట్లా చెప్తారు?: మంత్రి హరీశ్​ రావుహాట్‌ టాపిక్‌గా రాజాసింగ్ కేసు..
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిందేనా లేక బెయిల్ మంజూరు చేస్తారా అనే చర్చ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. రెండ్రోజుల క్రితం రాజాసింగ్‌ని రెండో సారి అరెస్ట్ చేసిన తర్వాత పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. అంటే పీడీ యాక్ట్‌ కింద ఎవరైనా జైలుకు వెళ్తే కనీసం 3నెలల నుంచి ఏడాది వరకు శిక్ష అనుభవించాలి. కాని రాజాసింగ్‌ విషయంలోనూ అదే జరుగుతుందా? లేక పీడీ యాక్ట్‌ పెట్టడంలో పోలీసుల పొరపాట్లను రాజాసింగ్‌ తరపు న్యాయవాదులు ఎత్తిచూపి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే బెయిల్‌పై బయటకు తెస్తారా అనే విషయంలో కొంత సస్పెన్స్ కొనసాగుతోంది.బయటకు వచ్చే ఛాన్సుందా..?

ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో ఆయన తరపు లాయర్లు ప్రస్తుతం అదే ప్రయత్నాల్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా మూడు లేదా అంతకంటే ఎక్కువ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తులపై పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎనిమిదేళ్లల్లో రాష్ట్ర వ్యాప్తం గా 2,573 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. ఇందులో అత్యధికంగా గత ఏడాది 664 మందిపై ఈ చట్టాన్ని ప్రయోగించి జైలుకు పంపారు.


న్యాయనిపుణులు ఏం చెబుతున్నారు..

సాధారణంగా పీడీ యాక్ట్‌ కేసులు అడ్వైజరీ బోర్డు పరిధిలో ఉంటాయి. ముగ్గురు విశ్రాంత న్యాయమూర్తులతో కూడిన అడ్వైజరీ బోర్డు.. పీడీ యాక్ట్‌ ప్రొసీజర్స్‌ను పరిశీలిస్తుంది. పోలీసులు అందించిన పీడీ యాక్ట్‌ ప్రతిపాదనల్ని, కేసు వివరాలను బోర్డు పరిగణనలోకి తీసుకుంటుంది. పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదైన నెల రోజుల్లోపు ఎప్పుడైనా ఈ బోర్డు నిందితుణ్ని విచారిస్తుంది. పోలీసులు అందించిన సాక్ష్యాధారాలను పరిశీలించడంతోపాటు నిందితుడి నుంచి వివరాలు తీసుకుంటుంది. పోలీసులు అక్రమ కేసులు పెట్టినట్లు గుర్తిస్తే బోర్డు తన విచక్షణ మేరకు పీడీ యాక్ట్‌ వెంటనే ఎత్తివేస్తుంది. పోలీసులు అందించిన ఆధారాలు నిజమేనని నిర్ధారణ అయితే ఏడాదిపాటు జైల్లోనే నిర్బంధించాలని ఆదేశిస్తుంది.


BJP Hanamkonda Meeting: నేడు హన్మకొండలో బీజేపీ బహిరంగ సభ.. ఆ ముగ్గురు ప్రముఖులతో జేపీ నడ్డా కీలక భేటీజైలా... బెయిలా ..

పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లిన వారికి నేరుగా హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకునే అవకాశం ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్న మాట. అడ్వైజరీ బోర్డు విచారణ తర్వాతే పీడీ యాక్ట్‌ను సవాల్‌ చేస్తూ నిందితులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే ఛాన్సుంది. ఇలా అడ్వైజరీ బోర్డు విచారణ తర్వాత హైకోర్టుకు వచ్చిన చాలా కేసుల్లో పీడీ యాక్ట్‌ను ఎత్తేశారు. పోలీసులు ప్రెజర్‌ వల్లే కొన్ని కేసుల్లో ప్రొసీజర్స్‌ పాటించకుండా పీడీ యాక్ట్ మోపుతున్నారని తప్పు పట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు న్యాయనిపుణులు. ఆ కారణంతోనే ఈమధ్య కాలంలోపీడీ యాక్ట్ కేసులు తగ్గాయంటున్నారు.


జైల్లో పటిష్ట భద్రత..

ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న రాజాసింగ్‌కి ప్రత్యేక బ్యారక్ కేటాయించారు. పలువురు ఉగ్రవాదులు ఉన్న జైలులో ఆయన్ని ఉంచడంతో భద్రతపై అనుమానాలు కలగడంతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆయనకు సంబంధించిన వివరాల్ని సీక్రెట్‌గా ఉంచుతున్నట్లుగా జైల్ అధికారులు తెలిపారు. శుక్రవారం రాజాసింగ్‌ని కుటుంబ సభ్యులతో పాటు ఆయన వ్యక్తిగత న్యాయవాదులు ములాఖత్‌లో కలిశారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Raja Singh, Telangana News

ఉత్తమ కథలు