హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana| YSRTP : YS షర్మిల మాటలకు అర్ధమేంటి..? ప్రజా ప్రస్థానం యాత్రలో వైఎస్ విజయమ్మ అడుగులు పడేనా..!

Telangana| YSRTP : YS షర్మిల మాటలకు అర్ధమేంటి..? ప్రజా ప్రస్థానం యాత్రలో వైఎస్ విజయమ్మ అడుగులు పడేనా..!

(ys sharmila ys vijayamma)

(ys sharmila ys vijayamma)

Telangana politics |YSRTP : ఏపీలో అమ్మ రాజీనామా వెనుక అసలు కారణం అదేనా..? తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం తన వంతు సాయం చేస్తానని అమ్మ చెప్పడం వెనుక వైఎస్ఆర్‌టీపీ రాజకీయ ప్రయోజనం ఉందా ..? ప్రజా ప్రస్థానయాత్రలో అమ్మ అడుగులు పడనున్నాయా.. ?

ఇంకా చదవండి ...

వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ(ysrtp) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మాటల వెనుక మర్మం ఏమిటనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. వర్షాలు, వరదలు, ప్రాజెక్టులు, అవినీతి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ హామీలు అంటూ టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌(KCR)పై ఓ రేంజ్‌లో విమర్శలు, ఆరోపణాస్త్రాలు సంధించిన వైఎస్‌ షర్మిల అగస్ట్‌(August)లో తాను చేయబోయే పాదయాత్రకు ఓ ప్రత్యేకత ఉందని చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా సోమవారం(Monday) పార్టీ ఆఫీస్‌లో ఆమె ప్రసంగంలో తెలంగాణ(Telangana)లో రాజన్న రాజ్యం రావాలని..అందుకోసం తన వంతు సాయం చేస్తానని వైఎస్‌ విజయమ్మ(YS Vijayamma) చెప్పారని షర్మిల అనడం చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి షర్మిల చేపట్టబోయే ప్రజా ప్రస్థాన పాదయాత్రలో విజయమ్మ కూడా అడుగులు వేస్తారనే టాక్ పొలిటికల్ సర్కిల్‌లో గట్టిగా వినిపిస్తోంది.

Hyderabad | Heavy rains:సైలెంట్‌గా కురిసిన వర్షానికి వణికిపోయిన ఓల్డ్ సిటీ ..ఈ వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు



అమ్మకిచ్చే గౌరవం ఎలా ఉంటుందో..

అగస్ట్ 2 లేదా 3వ తేది నుంచి తిరిగి పాదయాత్ర చేపట్టబోతున్నట్లుగా ప్రకటించారు వైఎస్‌ షర్మిల. ముఖ్యంగా వరదలు సంభవించిన ప్రాంతాల్లో తాను పర్యటించి వరద బాధితుల సమస్యలను తెలుసుకుంటామన్నారు. వైఎస్ఆర్‌ అందరి వాడని వైఎస్‌ షర్మిల చెప్పిన మాట ప్రకారం తెలంగాణలో వైఎస్ఆర్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వాళ్లను వైఎస్ఆర్‌టీపీ అక్కున చేర్చడానికే తన తల్లి విజయమ్మ పేరును షర్మిల ప్రస్తావించినట్లుగా భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు. అంతే కాదు తన వంతు సాయం చేస్తానన్న విజయమ్మకు ఏ పదవి ఇచ్చినా తక్కువే అవుతుందని షర్మిల చేసిన వ్యాఖ్యల వెనుక మతలబు లేకపోలేదని విపక్షాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్‌సీపీకి గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసిన వైఎస్‌ విజయమ్మ ..ఏపీలో రాజన్న రాజ్యం ఏర్పడే వరకు తన కుమారుడు వైఎస్‌ జగన్ వెన్నంటే ఉన్నారు.

అప్పుడు అక్కడ..ఇప్పుడు ఇక్కడ..

తెలంగాణలో వైఎస్‌ షర్మిల తండ్రి పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. ఇలాంటి సమయంలో వైఎస్‌ విజయమ్మ ఈసారి కుమార్తె వైఎస్ షర్మిల వెన్నంటే ఉండి వైఎస్ఆర్‌టీపీకి బలం చేకూర్చాలనే ఆలోచనలో ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీ స్థాపించిన సమయంలో కూడా వైఎస్‌ విజయమ్మ మీ రాజన్న బిడ్డను ఆశీర్వదించండి అని కోరారు. ఇప్పుడు అదే మాట ప్రకారం ఎన్నికలు ముగిసే వరకు వైఎస్‌ విజయమ్మ తన వెంటే ఉంటారనే సంకేతాన్ని వైఎస్ షర్మిల చెప్పకనే చెప్పినట్లుగా ఉంది.

Telangana : విద్యాంజలి కార్యక్రమంపై స్పందన కరువు .. ఆ జిల్లాల్లో శ్రీమంతులు ఎవరూ లేనట్లేగా..?



విజయం కోసమే విజయమ్మ..?

వైఎస్‌ షర్మిల వ్యాఖ్యలు, వైఎస్‌ఆర్‌టీపీలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే ..వైఎస్‌ విజయమ్మను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ...తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్‌ షర్మిల పార్టీకి ఓటింగ్‌ శాతం కొంతలో కొంత పెరిగే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఏ పదవి ఇచ్చినా వైఎస్‌ విజయమ్మకు తక్కువే అని వ్యాఖ్యానించిన వైఎస్ షర్మిల తల్లికి పదవి కట్టబెట్టి పార్టీకి సేవ చేయించుకుంటారా..? లేక తల్లిగా తన వెంట పాదయాత్ర చేయించి ..రాజన్న బిడ్డగా ప్రజల మద్దతును ఓట్ల రూపంలో పొందుతారో చూడాలి.

First published:

Tags: Telangana Politics, YS Sharmila, YS Vijayamma

ఉత్తమ కథలు