హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi sanjay: మసీదులపై బండి సంజయ్​ వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ చీఫ్​ దూకుడుకు కారణం అదేనా..?

Bandi sanjay: మసీదులపై బండి సంజయ్​ వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ చీఫ్​ దూకుడుకు కారణం అదేనా..?

బండి సంజయ్​ (ఫైల్​)

బండి సంజయ్​ (ఫైల్​)

బండి సంజయ్ మొన్న కరీంనగర్ లో చేసిన హాట్ కామెంట్ల పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు . అయితే ఇక్కడ మరో అంశం కూడా  ఉంది.

(Srinivas P, News 18, Karimnagar)

బండి సంజయ్ (Bandi sanjay) అంటే కరుడుకట్టిన కాషాయపు హిందువు.. ఎక్కడ మీటింగ్ జరిగిన హిందువాదాన్ని గట్టిగ వినిపిచడంలో మొదటి స్థానంలో ఉంటాడు బీజేపీ చీఫ్ (BJP Chief)​. అయితే ఆయన ఏది మాట్లాడిని వివాదం కాకుండా చూసుకుంటాడనే టాక్​ ఉంది. ఇక సొంత గడ్డపై మాట్లాడం అంటే బండికి ఎక్కువగా జోష్ వస్తుంది. అలాంటి బండి సంజయ్ మొన్న కరీంనగర్ లో చేసిన హాట్ కామెంట్ల పై (controversial remarks )అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు . ఈమధ్య కాశీ జ్ఞానవాపి మసీద్ (mosques) అంశం దేశవ్యాప్తంగా చర్చకు రావడంతో పాటు అక్కడ మసీదులోని తటాకంలో శివలింగం ఉన్నాయనే వార్తలు వైరల్ అయ్యాయి . ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని (Telangana) పరిస్థితులను కూడా ప్రతిబింబించాలనే ఉద్దేశంతో బండి సంజయ్ కామెంట్ చేశారని అందరూ విశ్లేషిస్తున్నారు . అయితే ఇక్కడ మరో అంశం కూడా  ఉంది.

మైనారిటీల ఓట్లు రావనే..?

రాజకీయలకు పురుడు పోసిన గడ్డగా కరీంనగర్ (Karimnagar) చాలా ముఖ్యమైనది. ఏ ఎన్నికలైన ఈక్కడి నుండే ఆజ్యం పోస్తారు . వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో 2 ఎంపీ , 4 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది . అయితే గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఒక్క బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు ఎన్నడూ లేవు . ముఖ్యంగా మైనారిటీల ప్రాబల్యం ఉన్న కరీంనగర్ పట్టణంలో వారి ఓట్లు బీజేపీకి (BJP) వ్యతిరేకంగా పడతాయి . ఈ అంశం బండి సంజయ్ కి తెలియనిది కాదు . కొద్దికాలంగా బండి సంజయ్ వేములవాడ అసెంబ్లీ స్థానం నుండి పోటీ పడతారని అందరూ అనుకుంటూ వచ్చారు . ప్రముఖ శైవక్షేత్ర వేములవాడ కావడం , బండి సంజయ్ కు చెందిన కమ్యూనిటీ కి భారీ స్థాయిలో అక్కడ ఓట్ల సంఖ్య ఉండటం కలిసి వచ్చే అంశం అని అంచనాకు వచ్చారు . కానీ ఇప్పటికే అక్కడ బీజేపీ టికెట్ కి పోటీ తీవ్రంగా ఉంది. మాజీ మహారాష్ట్ర గవర్నర్ సీనియర్ బీజేపీ నేత అయిన విద్యాసాగర్​రావు తనయుడు డాక్టర్ వికాస్ కి అక్కడ బీజేపీ నుంచి పోటీ చేయించే ప్రయత్నంలో ఉన్నారు ఆయన తండ్రి విద్యాసాగర్​రావు.

ఎంపీ అయితే కేంద్రంలో మంత్రి..?

మొదట్లోనే ఆటంకం ఎదురయ్యే పరిస్థితులు ఉండటంతో బండి సంజయ్ మనసు మార్చుకున్నారని తెలుస్తోంది . అంతేకాకుండా దక్షిణాదిన కూడా బీజేపీ క్రమక్రమంగా బలపడుతూ ఉండటంతో వచ్చే ఎన్నికల తర్వాత మరోమారు కేంద్రంలో అధికారం చేపడుతుందని విశ్లేషకుల అంచనా . ఇలాంటి సమయంలో మరోసారి కరీంనగర్ నుంచి ఎంపీగా ఎన్నికయితే కేంద్రంలో తప్పకుండా మంచి మంత్రి పదవి వరకు వెళ్లే అవకాశాలు బండి సంజయ్ లాంటి ఫైర్ బ్రాండ్ నేతకు పుష్కలంగా ఉంటాయి.

దూకుడుగా ఉంటేనే..

అందుకే మరోసారి ప్రజలకు చేరువ అయ్యే విధంగా వరుస కార్యక్రమాల్లో హాజరవుతూనే పలు అంశాలపై గట్టిగానే స్పందిస్తున్నారు బండి సంజయ్.. రెండు పాదయాత్రలు చేసి బండి సంజయ్ ఇప్పటికే మోదీ. అమిత్​ షా దగ్గర మంచి మార్కులు కొట్టేశాడని టాక్.. సో కాబట్టి బండికి రానున్న ఎన్నికలో అన్ని కలిసి వచ్చే అంశాలుగానే కనబడుతున్నాయి. అందుకే బండి ఇప్పటి నుండే దూకుడు పెంచడని పబ్లిక్ టాక్..

బీజేపీ జై శ్రీరామ్.. టీఆరెఎస్ జై హనుమాన్..

ఉత్తర తెలంగాణలో మతాలతో ప్రజలకు చేరువవ్వడానికి రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నారు. మొన్న హనుమాన్ జయంతి రోజున బండి సంజయ్ హిందూ ఎక్త దివస్ యాత్రను ప్రారంభిస్తే.. అదే రోజున టీఆర్​ఎస్​ పార్టీ హనుమాన్ చాలీసా పారాయణం గత సంవత్సరం నుంచి మొదలు పెట్టింది. కొండగట్టు లో ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రోజున పెద్ద ఎత్తున పారాయణం జరుగుతుంది. ముల్లును ముళ్ళుతోనే తీయాలని బీజేపీ, టీఆర్ఎస్​ రెండు పార్టీలు హిందూ పండగలు ఘనంగా నిర్వహించడం విశేషం.. ఇక బిజెపి ఎక్కడ సభ నిర్వహించినా జై శ్రీరామ్ అనే శ్లోకాన్ని గట్టిగ వినిపిస్తుంది. అలాగే ఈమధ్యకాలంలో టీఆర్​ఎస్​ పార్టీ కూడా ప్రతి సభలో జై హనుమాన్ అనే శ్లోకాన్ని గట్టిగ వినిపిస్తుంది.

First published:

Tags: Bandi sanjay, Bjp, Karimangar, Telangana Politics

ఉత్తమ కథలు