హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugode: మునుగోడులో కాంగ్రెస్‌ని గెలిచేందుకు టీపీసీసీ చీఫ్ ఆ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?

Munugode: మునుగోడులో కాంగ్రెస్‌ని గెలిచేందుకు టీపీసీసీ చీఫ్ ఆ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Munugode: మునుగోడు ఉపఎన్నిక విజయం మూడు పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్ధానం కావడంతో ఎలాగైనా చేజార్చుకోకుండా చూడాలని టీపీసీసీ చీఫ్‌ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ మాస్టర్ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు(Munugode)ఉపఎన్నికకు బీజేపీ సమరభేరి మోగిస్తే సిట్టింగ్ స్థానం చేజార్చుకున్న కాంగ్రెస్‌(Congress)ఆ సీటును గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా రాష్ట్రంలో హస్తం గుర్తు పార్టీకి హవా తగ్గుతున్న క్రమంలో అగ్రనేతల మధ్య ఆధిపత్యపోరు కాస్తా హైకమాండ్‌కి చేరింది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు అందరూ సమన్వయంతో పని చేసి మునుగోడులో కాంగ్రెస్‌ని గెలిపించాలని సూచించింది. నల్గొండ(Nalgonda)జిల్లాలో కాంగ్రెస్‌ని గెలిపించుకునే బాధ్యత మాది ..ఎవరూ జిల్లాకు రావాల్సిన అవసరం లేదని గతంలో రాహుల్‌గాంధీ(Rahul Gandhi)పర్యటన సమయంలో బల్లగుద్ది చెప్పిన కోమటిరెడ్డి(Komatireddy)కి ఈసారి మునుగోడు బైపోల్‌ బాధ్యతను అప్పగించి తాను సైలెంట్‌గా ఉంటే బెటర్‌ అనే యోచనలో టీపీసీసీ చీఫ్‌(TPCC chief )ఉన్నట్లు సమాచారం. జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కి చెరి సమానమైన పలుకుబడి, ఫాలోయింగ్ ఉంది. రాజగోపాల్‌రెడ్డి(Rajagopal Reddy)కాంగ్రెస్‌ను వీడి బీజేపీ(BJP)లో చేరడం మునుగోడు పోటీకి సిద్ధపడటంతో..కోమటరెడ్డి సైలెంట్‌ అయినట్లుగా తెలుస్తోంది.

BJP | KTR : అమిత్ షాకు చెప్పులు అందించిన బండి సంజయ్.. కేటీఆర్ సెటైర్..! వీడియో వైరల్!!మునుగోడులో గెలిపించేదెవరూ..?

రేవంత్‌రెడ్డి పీసీసీచీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ ఖాతాలో ఒక్క విజయం నమోదు కాలేదు. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్‌, హజురాబాద్‌ స్థానాన్ని బీజేపీ తన్నుకుపోయాయి. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్దికి కనీసం డిపాజిట్‌ రాని పరిస్థితి. రాజగోపాల్‌రెడ్డికి పట్టున్న మునగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి ఎవరు రంగంలోకి దిగినా ఫలితం హుజురాబాద్‌ తరహాలోనే ఉంటుందని భావిస్తున్నారట టీపీసీసీ చీఫ్. అందుకే ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి సోదరుడు, భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ స్టార్ క్యాంపెయిన్‌గా ఉన్న వెంకట్‌రెడ్డికి మునుగోడులో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యతను అప్పగించి సైలెంట్‌గా ఉంటే బెటర్ అనే యోచనలో ఉన్నారని సమాచారం.

టీపీసీసీ చీఫ్‌ మాస్టర్ ప్లాన్ ఏంటీ..?

రాజగోపాల్‌రెడ్డి తరహాలోనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పార్టీ మారుతానే ప్రచారం జోరుగా జరిగింది. దాన్ని ఖండించిన వెంకట్‌రెడ్డి ... ఇప్పుడు మాత్రం తటస్థంగా ఉండటం వెనుక కారణం ఏమై ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. మరోవైపు ఆదివారం అమిత్‌షా మునుగోడు పర్యటనకు వచ్చిన సందర్భంలో నియోజకవర్గంలో కాంగ్రెస్‌ శ్రేణులు వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ఈ నిరసనలకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎలాంటి మద్దతు ఇవ్వకపోవడం చూస్తుంటే మునుగోడు బైపోల్‌ పోరులో తాను కూడా ప్రేక్షకపాత్ర పోషిస్తేనే బెటర్ అనే ఆలోచనలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌కి మద్దతుగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఫ్లోరైడ్ సమస్యను పట్టుకొని టీఆర్ఎస్‌ని టార్గెట్‌ చేస్తూ ట్వీట్‌ కూడా చేశారు వెంకట్‌రెడ్డి.

Amit Shah | Jr.NTR : Jr.ఎన్టీఆర్‌, రామోజీరావుతో అమిత్‌షా భేటీ .. బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీపై విస్తృతమైన చర్చ


కన్ప్యూజన్‌లో కోమటిరెడ్డి బ్రదర్ ..

మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి వరకు టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్దుల పేర్లను కూడా ఖరారు చేయలేదు. అలాంటిది కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యతను వెంకట్‌రెడ్డికి అప్పగిస్తే పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది. టీపీసీసీ చీఫ్‌ ఈ ట్రిక్ ప్లే చేసి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫాలోయింగ్‌ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారట. ఒకవేళ మునుగోడులో కాంగ్రెస్‌ గెలిస్తే ..విజయం తన ఖాతాలో పడుతుందని..ఓడితో జిల్లాలో తనకు పట్టుందని చెప్పిన కోమటిరెడ్డి గెలిపించలేకపోయారని ఓటమిని ఆయన ఖాతాలో వేయవచ్చనే ధోరణితో ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.

Published by:Siva Nanduri
First published:

Tags: Komatireddy venkat reddy, Munugode Bypoll, Telangana Politics, TS Congress