TS POLITICS WHAT IS IN THE BHAGYANAGAR DECLARATION THAT AMIT SHAH WILL INTRODUCE IN THE BJP NATIONAL EXECUTIVE MEETING PRV
BJP National executive meeting 2022: అమిత్ షా ప్రవేశపెట్టిన ‘‘భాగ్యనగర డిక్లరేషన్’’.. అసలు అందులో ఏముంది?
అమిత్ షా, చార్మినార్ (హైదరాబాద్ ముఖ చిత్రం)
హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (BJP National executive meeting 2022) జరుగుతున్నాయి. ‘‘భాగ్యనగర డిక్లరేషన్ ’’ పేరుతో రాజకీయ తీర్మానం చేయనున్నారు. ఈ రాజకీయ తీర్మానంలో బీజేపీ ఏం చెప్పనుందనేది ఆసక్తి నెలకొంది.
తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) వేడెక్కాయి. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (BJP National executive meeting 2022) జరుగుతున్నాయి. పార్టీ విస్తరణ, మోదీ పాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ ఈ సమావేశాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేదుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ (Hyderabad)లో సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డా (JP Nadda) వంటి అగ్రనేతలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, మాజీ సీఎంలంతా హాజరవుతున్నారు. నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇందుకోసం అంతా సిద్ధం చేశారు. భారీగా జన సమీకరణ చేస్తున్నారు. కనివినీ ఎరుగని రీతిలో సభను విజయవంతం చేసేందుకు కమలం నేతలు కంకణం కట్టుకున్నారు.
350 మంది ప్రతినిధులు..
కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం నాడు ఉదయం ప్రారంభమయ్యాయి. శనివారం నాడు సాయంత్రం సమావేశాలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి 350 మంది ప్రతినిధులు జాతీయ కార్యవర్గసమావేశాల్లో పాల్గొన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇవాళ రాజకీయ తీర్మానంపై చర్చించనున్నారు.
అమిత్ షా తీర్మానం..
ఆదివారం ‘‘భాగ్యనగర డిక్లరేషన్ (Bhagyanagara declaration) ’’ పేరుతో రాజకీయ తీర్మానం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తీర్మానాన్ని ప్రవేశట్టారు. దేశంలో అధికారంలో లేని రాష్ట్రాల్లో ఏ రకమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలనే దానిపై బీజేపీ నాయకత్వం చర్చించనుంది. తెలంగాణ (Telangana), కేరళ, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఏ రకమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలనే దానిపై బీజేపీ నాయకత్వం చర్చించనుంది. మరో వైపు తెలంగాణపై కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక తీర్మానం చేసే అవకాశం ఉంది.
దేశంలో పార్టీ పరిస్థితిపై ఈ రాజకీయ తీర్మానంలో చర్చించనున్నారు బీజేపీ అగ్రనేతలు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో కమలం పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ పార్టీని విస్తరించాల్సి ఉంది అనేది చర్చిస్తారు. అంతేకాకుండా ఏ ప్రాంతంలో ఏ రకమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలనే దానిపై బీజేపీ అగ్ర నాయకత్వం ఈ తీర్మానంపై చర్చించనుంది. ఆదివారం మధ్యాహ్నం తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో జేపీ నడ్డా, అమిత్ షాలు ప్రసంగించనున్నారు. ఇక మోదీ ప్రసంగంతో ముగియనున్నాయి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.