బండి సంజయ్ (Bandi Sanjay) ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భైంసా సమీపంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ..రాష్ట్ర సర్కార్ పై మండిపడ్డారు. ఇవాళ మీ ప్రభుత్వం ఉంది. రేపు మా ప్రభుత్వం వస్తుంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భైంసాను మహిషాగా పేరు మారుస్తాం. కార్యకర్తలపై అన్యాయంగా పెట్టిన కేసులను ఎత్తివేసి భైంసాను దత్తత తీసుకుంటాం అని బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు.
రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే వాళ్లకు అన్ని అనుమతులు ఉంటాయి కానీ మాకు మాత్రం అడుగడుగున ఆంక్షలు ఉంటాయని అన్నారు. ఇక హిందువులు పండుగలు జరుపుకోకుండా MIM వేధింపులకు గురి చేసిందన్నారు. మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం. ఏ దేశంలో ఉన్నాం. టీఆర్ఎస్ , ఎంఐఎం కలిసి హిందువులపై దాడులు చేశాయి. కానీ భైంసా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. భైంసా అంటేనే సాధారణంగా సీఎం కేసీఆర్ కు భయం. ఇక ఈ సభ చూశాక కేసీఆర్ రెండు పెగ్గులు తాగేది ఫుల్ బాటిల్ లేపేస్తాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడాలని బండి సంజయ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హిందూ ధర్మం కోసం కాషాయ జెండాకు పట్టం కావాలన్నారు.
ఐదో విడత పాదయాత్రలో భాగంగా భైంసా నుండి కరీంనగర్ వరకు యాత్ర సాగనుంది. 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 17వ తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. నేడు గుండగామ్ నుండి మహాగన్, చటా మీదుగా లింబా వరకు యాత్ర కొనసాగనుంది. ఇక 3వ రోజు లింబా నుండి ప్రారంభమై కుంటాల, అమ్బకంటి మీదుగా బూజురుగుకు చేరుకోనుంది. ఈ మూడు రోజులు కూడా ముథోల్ అసెంబ్లీ నియోజవర్గంలోనే పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 1 నుండి 6 వరకు నిర్మల్ అసెంబ్లీ నియోగాజవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 2న రాంపూర్ నుండి లోలం మీదుగా చిట్యాల వరకు 3న చిట్యాల నుండి మంజులపూర్, నిర్మల్ రోడ్, ఎడిగం, ఎల్లపల్లి, కొండాపూర్ మీదుగా ముక్తపూర్ వరకు కొనసాగనుంది. 4న లక్ష్మణ్ చందా మండలంలో 5న మమ్డా మండలంలో, 6,7న ఖానాపూర్ నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. డిసెంబర్ 8,9 తేదీల్లో కోరుట్ల నియోజకవర్గంలో 21.7 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగనుంది.
డిసెంబర్ 10న కోరుట్ల పట్టణం మీదుగా వేములవాడ నియోజకవర్గానికి చేరుకోనుంది.డిసెంబర్ 11న మేడిపల్లి, తాటిపల్లి మీదుగా జగిత్యాల రూరల్ వరకు యాత్ర సాగనుంది. డిసెంబర్ 12న జగిత్యాల పట్టణం, డిసెంబర్ 13న చొప్పదండి నియోజకవర్గం నుండి కొండగట్టుకు చేరుకోనుంది. డిసెంబర్ 14,15,16 తేదీలో చొప్పదండిలో యాత్ర కొనసాగగా..డిసెంబర్ 16,17న కరీంనగర్ లో పాదయాత్ర సాగగా చివరి రోజు కరీంనగర్ లోని SR నగర్ కళాశాల వద్ద పాదయాత్ర ముగియనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, CM KCR, Telangana, Telangana News, Trs