Home /News /telangana /

TS POLITICS WARANGAL DISTRICT TRS KEY LEADER ERRABELLI PRADEEP RAO HAS ANNOUNCED HIS RESIGNATION FROM THE PARTY PRV

TRS Leader resign: టీఆర్​ఎస్​ పార్టీకి బిగ్​ షాక్​.. వరంగల్ జిల్లా​ కీలక నేత రాజీనామా..

కేసీఆర్, దయాకర్ రావు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు (పాత ఫొటోలు)

కేసీఆర్, దయాకర్ రావు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు (పాత ఫొటోలు)

అధికార టీఆర్​ఎస్​ పార్టీకి షాక్​ల మీద షాకులు తగులుతున్నాయి. వరంగల్​లో పార్టీ కీలక నేత ఎర్రబెల్లి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    అధికార టీఆర్​ఎస్ (TRS)​ పార్టీకి వరంగల్​లో (Warangal) బిగ్​ షాక్​ తగిలింది. పార్టీ కీలక నేత ఎర్రబెల్లి ప్రదీప్​రావు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం నాడు వరంగల్ లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు మీడియాతో మాట్లాడారు.  టీఆర్​ఎస్​ పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నా. పార్టీలో ఉన్నా కూడా తిడుతున్నారంటే పార్టీలో  కొనసాగి ఎందుకని ఎర్రబెల్లి ప్రదీప్​ రావు (Errabelli Pradeep rao) అన్నారు. ఏదైనా నాయకుడు కోస్తా పొడుస్తా చీరుస్తా అంటారా? అని ఆయన ప్రశ్నించారు.  4 వేల కోట్లు పెట్టి వరంగల్​ను అభివృద్ధి చేసుంటే.. 25 వేల కుటుంబాలను నిజంగానే మీరు ఆదుకుంటే ప్రజలు మీకు బ్రహ్మరథం పడుతారని ఎమ్మెల్యే నరేందర్​కు చురకలంటిచారు. దమ్ముంటే రాజీనామా (Resignation) చేయాలని ప్రదీప్​రావు సవాల్​ విసిరారు. ఒకవేళ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. ఆయనకే బతికున్నంత వరకు మద్దతిస్తానని ఎర్రబెల్లి అన్నారు.

    ఎమ్మెల్యే నరేందర్ అనుచరుల నుండి తమకు బెదిరింపులు వస్తున్నాయని కూడా ఆయన చెప్పారు. తాను తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో తనను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారన్నారు. తాను పార్టీలోనే ఉన్న సమయంలో తనను ఉద్దేశించి ఎమ్మెల్యే నరేందర్ రావు చేసిన వ్యాఖ్యలను ప్రదీప్ రావు తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమం కోసం తాను పనిచేసినట్టుగా చెప్పారు. బంగారం తెలంగాణ సాధన కోసం తాను అనేక త్యాగాలు చేసినట్టుగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా కూడా తాను బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ బలోపేతం కోసం పనిచేసినట్టుగా ఆయన చెప్పారు.



    పలు దఫాలు కూడా పార్టీ నాయకత్వం తనను పిలిచి నీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని కూడా ఇవ్వలేదన్నారు. . పార్టీలో ఉన్నా కూడా తనకు గుర్తింపు ఇవ్వడం లేదన్నారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ రావు తనను అసభ్యంగా దూషించినా కూడా పార్టీ నేతలు ఎవరూ కూడా ఖండించకపోవడాన్ని కూడా ప్రదీప్ రావు ప్రస్తావించారు. తాను ఇంకా పార్టీలోనే కొనసాగుతాననే ఉద్దేశ్యంతోనే నరేందర్ రావు తనను అసబ్యంగా దూషించారేమోనని ఆయన అభిప్రాయపడ్డారు.

    సవాల్ ను స్వీకరించాలని..

    తన సహకారం లేకుండానే నరేందర్ రావు ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టుగా చెబుతున్నారన్నారు ప్రదీప్​రావు . ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నరేందర్ రావు తన మద్దతు లేకుండా విజయం సాధించాలని ప్రదీప్ రావు సవాల్ విసిరారు. ఈ నెల 10వ తేదీ లోపుగా తన సవాల్ ను స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. నరేందర్ స్పందన కోసం తాను ఎదురు చూస్తున్నట్టుగాచెప్పారు. నరేందర్ స్పందన వచ్చిన తర్వాతే తానే ఏదైనా పార్టీలో చేరుతానని ప్రదీప్ రావు స్పష్టం చేశారు. తాను పార్టీలోనే ఉన్న సమయంలోనే కోస్తా, చీరుస్తా అని నరేందర్ రావు బెదిరింపులకు పాల్పడ్డారని ప్రదీప్ రావు ఆరోపణలు చేశారు. వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 4 వేల కోట్ల అభివృద్ది పనులకు ఖర్చు చేసినట్టుగా ఎమ్మెల్యే చెబుతున్నారన్నారు. ఎక్కడ రూ. 4 వేల కోట్లు ఖర్చు పెట్టారని చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ప్రదీప్​ రావు..  మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు సోదరుడు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, Politics, TRS leaders, Warangal

    తదుపరి వార్తలు