TS POLITICS VOTERS OF KARIMNAGAR DISTRICT ARE CONFUSED BY PHONE CALLS FROM SURVEY AGENCIES SNR KNR
Telangana : ఆ ఫోన్‌కాల్స్‌తో కరీంనగర్ జిల్లా ప్రజలు పరేషాన్ .. ఏం అడుగుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు
(ఫోన్‌కాల్స్‌తో పరేషాన్)
Karimnagar: తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఏదో తెలియని అలజడి మొదలైంది. జిల్లాలోని ఓటర్లకు అపరిచితులు ఫోన్లు చేస్తూ వ్యక్తులు, రాజకీయ పార్టీలు, స్థానికంగా ఉన్న సమస్యలు, లోకల్ లీడర్ల తీరుపై అనేక ప్రశ్నలు వేస్తూ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారు. సర్వే ఏజెన్సీల పేరుతో వస్తున్న ఆకాశరామన్న ఫోన్‌కాల్స్‌కి ఎలా రిప్లై ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ఓటర్లు.
(P.Srinivas,New18,Karimnagar)
ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే తెలంగాణ(Telangana)లో అప్పుడే హడావుడి మొదలైంది. ఓటర్ల మనసులో ఏముందో తెలుసుకునేందుకు ప్రజాఅభిప్రాయసేకరణ కోసం పలు సర్వే ఏజెన్సీలను రంగంలోకి దిగాయి. ముఖ్యంగా కరీంనగర్(Karimnagar) జిల్లాలోని ఓటర్లకు వస్తున్న ఫోన్ కాల్స్(Phone calls) లో ఎక్కువశాతం సర్వే ఏజెన్సీలవే(Survey agencies) ఉంటున్నాయని సదరు ప్రజలు వాపోతున్నారు. ఫోన్లోనే కాదు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగి మరీ వివరాలు సేకరిస్తున్నాయి. జిల్లాలోని నియోజకవర్గాల వారిగా సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటీ ? ఓటర్లు ఏ నాయకుని వైపు మొగ్గు చూపుతున్నారు? సిట్టింగ్ పై వ్యతిరేకతకు కారణాలు ఏంటీ , వేరే నేతల ప్లస్ , మైనస్ ఏంటీ అన్న ప్రశ్నలు వేస్తున్నారు . రాష్ట్రంలో టీఆరెఎస్ కు అనుకూలంగా ఓటర్లు ఉన్నారా లేదా అన్న విషయంపై కూడా తెలుసుకుంటున్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) పనితీరుపై ఎంత రేటింగ్ ఇస్తారు ? ఎమ్మెల్యేకు అయితే ఎన్ని మార్కులు వేస్తారంటూ అడుగుతున్నారు.
సర్వే పేరుతో సంపుతున్నారు..
వ్యక్తులు, పార్టీల గురించే కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ప్రభావం ఎంత మేర ఉందనే విషయాన్ని ప్రజల నుంచి రాబడుతున్నాయి సర్వే ఏజెన్సీలు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా లేదా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారనే విషయాలపై ఆరా తీస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే వయసుల వారిగా ఓటర్లను విభజించి ఏ ఏజ్ గ్రూప్ వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు. ఎవరికి ఓటు వేయాలనే ఆలోచనలో ఉన్నారనే సంగతులను కూపీ లాగుతున్నాయి సర్వే ఏజెన్సీలు. ప్రధానంగా రైతులు, కార్మికులు, మహిళలు, వృద్ధులను ప్రత్యేకంగా అడుగుతున్నాయి.
నిద్ర లేచింది మొదలు ఫోన్‌కాల్సే..
గతంలో ఒకటి రెండు సర్వే ఏజెన్సీలు గుట్టు చప్పుడు కాకుండా ఆరా తీసేవి...కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. స్థానికంగా రాజకీయ పార్టీల సంఖ్య పెరగడంతో సర్వే ఏజెన్సీలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి. సర్వే ఏజెన్సీ ప్రజాప్రతినిధులు తరచూ ఫోన్లు చేస్తూ ఓటర్లను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ విసిగిస్తున్నారంటూ జిల్లా ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. తమకు ఫోన్లు చేస్తున్న వారు నిజంగా సర్వే ఏజెన్సీలకు చెందిన వారేనా లేక పార్టీల ప్రతినిధులా అనే సందేహాలను సైతం వ్యక్తం చేస్తున్నారు.
ఇదెక్కడి ఖర్మ అంటున్న ఓటర్లు..
హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో కూడా సుమారు 6నెలల పాటు హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలకు పొద్దున్న లేచిన నుండి రాత్రి నిద్రపోయే వరకు రోజుకు 10 ఫోన్‌కాల్స్ వచ్చేవంటున్నారు. మళ్లీ ఇప్పుడూ అదే పద్దతి మొదలైందంటున్నారు. రాష్టంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఇప్పటినుండే ఏజెన్సీలు. పార్టీ ఆఫీసుల నుండి ఫోన్ కాల్స్ రావడంతో ప్రజలు చిరాకు పడిపోతున్నారు. ఏదైనా ఇంపార్టెంట్ కాల్స్ అనుకోని లిఫ్ట్ చేస్తే.. తీరా పార్టీలనుండి ఏజెన్సీ ప్రతినిధుల నుండి ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ? మీ ఎమ్మెల్యే పనితీరు, నాయకుల పనితీరు ఎలా ఉందంటూ గంటల తరబడి ప్రశ్నలు వేస్తుండటంతో ఫోన్లు ఎత్తాలంటేనే చిరాకు పడుతుందంటున్నారు. అలాగని ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏదైనా ఎమర్జెన్సీ ఫోన్‌కాల్స్ మిస్ అవుతామనే ఆలోచనతోనే ఆన్సర్ చేయాల్సి వస్తోందని ఫలితంగానే గంటల తరబడి సర్వే ఏజెన్సీ ప్రతినిధులతో కాల్స్ మాట్లాడాల్సి వస్తోందంటున్నారు కరీంనగర్ ప్రజలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.