హోమ్ /వార్తలు /తెలంగాణ /

Vijayashanti: విజయశాంతి పొలిటికల్ జర్నీ @25..రాములమ్మ షాకింగ్ కామెంట్స్

Vijayashanti: విజయశాంతి పొలిటికల్ జర్నీ @25..రాములమ్మ షాకింగ్ కామెంట్స్

రాములమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రాములమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ విజయశాంతి తన మార్క్ చూపిస్తున్నారు. ఆమె బీజేపీలో చేరినప్పటి నుండి కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా రాములమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను తెలంగాణ కోసం పోరాడి అందరికి మాత్రం శత్రువులా మారానని సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలన్నదే చిన్నప్పటి నుంచి నా కల అని ఆమె అన్నారు. అవినీతి లేని క్రమశిక్షణ గల పార్టీ బీజేపీ అని అందుకే ఈ పార్టీలో చేరానన్నారు. రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు అయిన సందర్బంగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ విజయశాంతి తన మార్క్ చూపిస్తున్నారు. ఆమె బీజేపీలో చేరినప్పటి నుండి కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా రాములమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను తెలంగాణ కోసం పోరాడి అందరికి మాత్రం శత్రువులా మారానని సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలన్నదే చిన్నప్పటి నుంచి నా కల అని ఆమె అన్నారు. అవినీతి లేని క్రమశిక్షణ గల పార్టీ బీజేపీ అని అందుకే ఈ పార్టీలో చేరానన్నారు. రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు అయిన సందర్బంగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఈ కామెంట్స్ చేశారు.

Telangana Politics: రేవంత్ రెడ్డి ఇలాకాలో బీఆర్ఎస్ కు షాక్..! ఆ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరబోతున్నారా?

బీజేపీతోనే రాజకీయ ప్రస్థానం స్టార్ట్..

1998 జనవరి 26న వాజ్ పేయి, అద్వానీల సమక్షంలో బీజేపీలో చేరాను.  బీజేపీతోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభం అయింది చెప్పిన విజయశాంతి గతంలో బాధతోనే పార్టీని వీడానని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. సినీ పరిశ్రమలో నేను 43 ఏళ్లు పని చేశా. కానీ రాజకీయాల్లో ఉన్న ఈ 25 ఏళ్లు మాత్రం సుదీర్ఘంగా అనిపించాయని అన్నారు. తెలంగాణ కోసం మొదటి నుంచి బీజేపీ పోరాటం చేసింది. సోనియా గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేయమని అద్వానీ అడిగారు. ఎన్ని కష్టాలైనా, నష్టాలైన, వెన్నుపోట్లు వున్న పోరాడుతూ వచ్చాను. తెలంగాణ వాదం వదిలిపెడితే ఎన్నో పదవులు వచ్చేవి. అసలు తెలంగాణ కోసమే నేను బయటకు వచ్చాను. సమైక్య వాదులు నాపై ఒత్తిడి చేస్తూ వచ్చారు. అయితే బాధతోనే బీజేపీ నుండి బయటకొచ్చా.

Telangana: మరోసారి తెరపైకి వైశాలి కిడ్నాప్ కేసు..హైకోర్టులో నిందితునికి ఊరట

కేసీఆర్ అనే రాక్షసుడు నా జీవితంలో ఎంటర్

తెలంగాణ సమస్యలపై పోరాడుతుంటే కేసీఆర్ అనే రాక్షసుడు నా జీవితంలో ఎంటర్ అయ్యాడని రాములమ్మ చెప్పుకొచ్చారు. మెదక్ లో ఎంపీగా టికెట్ ఇచ్చి నన్ను ఓడించడానికి కేసీఆర్ కుట్ర చేశాడు. ఆ తర్వాత అకారణంగా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక బిల్లు రోజు నన్ను పోడియం వద్దకు రప్పించి కేసీఆర్ సభ నుంచి జారుకున్నాడని అన్నారు. అందమైన తెలంగాణ ఇప్పుడు అసమర్ధుని చేతిలో ఉందని రాములమ్మ చెప్పుకొచ్చారు.

కేసీఆర్ ఒక విషసర్పం. మరొకసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే మాత్రం ఎవ్వరూ బ్రతకరు. చాపకింద నీరులా అందరిని చంపేస్తాడు. ఎవ్వరికీ పెన్షన్ కూడా ఇవ్వడాన్ని ఎద్దేవా చేశారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని విజయశాంతి ప్రజలను కోరారు.

First published:

Tags: Bjp, Kcr, Telangana, Vijayashanthi

ఉత్తమ కథలు