ఏ స్థాయి ప్రజాప్రతినిధులైనా ఆదర్శవంతంగా నిలవాలి. పరిపాలన కొనసాగించే అధికారులకు, శాంతి భద్రతల్ని పరిరక్షించే పోలీసులకు సహాకరించాలి. వారికి మార్గదర్శకంగా నిలవాలి. కాని గ్రేటర్ హైదరాబాద్‌లో ఓ కార్పొరేటర్ పోలీసులపై తన జులుం ప్రదర్శించాడు. భోలక్‌పూర్ కార్పొరేటర్‌గా ఉన్న మొహ్మద్ గౌసుద్దీన్ పోలీసులను బెదిరించే విధంగా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డ్యూటీకి వచ్చిన వాడివి డ్యూటీ చేసుకోని వెళ్లిపో అంతే ఏందీ నువ్వు చెప్పేది అంటూ చాలా పొగరుగా, ఆగ్రహంతో పోలీసులపై మాటలు వదిలాడు. అక్కడున్న పోలీసులు పైఅధికారులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించడంతో చేసుకో ఎవరికి ఫోన్ చేసుకుంటావో చేసుకో ఇక్కడే ఉంటా..నీ మాట వినను ఎస్సైని పిలిపించూ అంటూ మొండిగా సమాధానం చెప్పాడు. పోలీసులు చెప్పేది వినిపించుకోకుండా వాళ్లను భయపెట్టే విధంగా ప్రవర్తించాడు కార్పొరేటర్ మొహ్మద్ గౌసుద్దీన్. చుట్టూ జనం చూస్తుండటంతో మరింత పెట్రేగిపోయి మరీ పోలీసులకు ఏమాత్రం గౌరవించకుండా దిగజార్చిమాట్లాడటం వీడియోలో రికార్డైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Greater hyderabad, Viral Video