కేసీఆర్ నిజాం కాలం నాటి ఆలోచనలతో పాలన చేస్తున్నారని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.(Kishan Reddy) కల్వకుంట్ల కుటుంబం కారణంగా తెలంగాణ పరువు, గౌరవం పోతుందని ఆరోపించారు. ప్రభుత్వ చర్యల కారణంగా తెలంగాణ రాష్ట్రం నవ్వులపాలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం కోసమే కల్వకుంట్ల కుటుంబం తపిస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌వి(KCR) దుర్మార్గపు ఆలోచనలు అని మండిపడ్డారు. ప్రధాని, గవర్నర్ వస్తే కనీసం గౌరవం చూపడం లేదని విమర్శించారు. దేశానికో విధానం, తెలంగాణకు ఓ విధానం ఉండదని.. తెలంగాణ(Telangana) సర్కార్ తీరును ఖండిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు కొన్ని కనీస గౌరవ, మర్యాదలను పాటించాల్సి ఉందని.. ఈ విషయం కేసీఆర్ ప్రభుత్వం గుర్తించడం లేదని అన్నారు.
తెలంగాణ సర్కార్ కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా వ్యవహరించలేదని ఆయన అన్నారు. తన కొడుకు ముఖ్యమంత్రి కాడేమోనని కేసీఆర్ ఈ విధమైన వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ విధమైన విధానాలతో తెలంగాణ పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉండే విధానమే.. కేసీఆర్‌కు కూడా ఉంటుందని గుర్తు చేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా కనీసం రాష్ట్రం నుంచి శకటానికి సంబంధించిన ప్రపోజల్ కూడా పంపలేదని అన్నారు. సీఎం కేసీఆర్ దిగజారుడు రాజకీయలు చేయడం దురదృష్టకరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రిని లైట్ తీసుకున్నారా ?.. గ్యాప్ పెరిగిందా ?
MMTS Trains Cancelled: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు షాక్.. భారీగా సర్వీసులు రద్దు.. వివరాలివే
ధర్నాలు, పాదయాత్రలు చేయాలంటే కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. గవర్నర్ ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ పాటించడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ పర్యటనలు ఉంటే ముందస్తు అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. అన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ నివేదిక పంపుతారని అన్నారు. మూడు నెలలు అయితే పోయే ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన ఎందుకని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Kishan Reddy, Telangana