Home /News /telangana /

TS POLITICS UNION MINISTER KISHAN REDDY SAID THAT THE SAME THING WILL HAPPEN IN TELANGANA AS THE SHIV SENA GOVERNMENT FELL IN MAHARASHTRA SNR

Telangana : మహరాష్ట్ర పొలిటికల్ సీనే..తెలంగాణలో రిపీట్ అవుతుంది : కిషన్‌రెడ్డి

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Telangana politics : తెలంగాణలో కూడా మహరాష్ట్రలో జరిగినట్లుగానే జరుగుతుందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఈ వ్యాఖ్యల వెనుక మంత్రిగారి పరమార్ధం ఏమిటో కాని..రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం పెద్ద దుమారం రేపుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ ఈ కామెంట్ చేయడంతో ఒకింత ఆసక్తి నెలకొంది.

ఇంకా చదవండి ...
కేంద్రమంత్రి,సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌ రెడ్డి(Kishan Reddy)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. తెలంగాణ(Telangana)లో కమలం జెండా ఎగురవేయాలన్న కేంద్రం ఆలోచనలనకు అనుగూణంగానే ఆయన వ్యాఖ్యలు ఉండటంతో రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది. మహరాష్ట్ర (Maharashtra)లో ఉద్దవ్‌ థాక్రే(Uddhav Thackeray)సర్కారు పడిపోయినట్లుగానే తెలంగాణలో కూడా జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడం చూస్తుంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వెనుక అలాంటి వ్యూహారచన ఏమైనా ఉందా అనే సందేహాలను వ్యక్తపరుస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

మహారాష్ట్ర సీన్ రిపీట్ అవుతుంది..
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలన్న సింగిల్ అజెండాతోనే హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గసమావేశాలు పెడుతున్నారని నిన్నటి వరకు అనుకున్నారు. కాని తాజాగా కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రధాని సభ వేదిక ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన సమయంలో మహ సర్కారు పతనం అయిన తీరుపై వ్యాఖ్యానించారు. మహరాష్ట్రలో శివసేన పుత్రవాత్సల్యంతో చూపించిన ప్రేమ కారణంగానే థాక్రే ప్రభుత్వం పడిపోయిందని...త్వరలో తెలంగాణలో కూడా అదే జరగబోతుందని చెప్పడం పొలిటికల్ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారుతోంది. అంతే కాదు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల్ని కలిసేందుకు వస్తుంటే ..రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ అడ్డంకులు, అవరోధాలు సృష్టించాలని చూస్తోందని మండిపడ్డారు.



కిషన్‌రెడ్డి మాటల వెనుక మర్మమేంటి..
బీజేపీతో పోటీగా టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కూడా కేంద్రమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజల సహాకారంతో సమావేశాలు నిర్వహించుకుంటుంటే..టీఆర్‌ఎస్‌ ప్రజాధనం ఖర్చు చేసి హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ చేసిన కుట్రలు, అవరోధాలు బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేవమని..జాతీయ కార్యవర్గసమావేశాలు సక్సెస్ అవుతాయన్నారు. అంతే కాదు బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్‌లో చేరిన విషయం గుర్తించి కేంద్రమంత్రిని ప్రశ్నిస్తే ...ముందు ముందు మీరే చూస్తారు కదా ఇలాంటి వాటిని బీజేపీ ఎలా తిప్పికొడుతుందో అని బదులిచ్చారు.

ఇది చదవండి: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి జెడ్పీ చైర్మ‌న్లు, ఎంపీపీల‌కూ ఆ పవర్​



రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్..
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని టూర్ తెలంగాణ రాజకీయాల్ని ఒక్కసారిగా హీటెక్కించాయి. టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది..పార్టీ నేతల్లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారంటూ బీజేపీ ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మాలచుకోవాలని చూస్తోంది. అటు రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్‌ కూడా అంతే తెలివిగా బీజేపీని ప్రజల్లో ఎండగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేమి లేదు. చివరకు ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రాష్ట్రానికి కేంద్రం అన్యాయమే చేసిందనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకోవాలని చూస్తోంది. రెండు పార్టీల విధి, విధానాలు, రాజకీయ ఎత్తుగడులు ఎలా ఉన్నా..రాష్ట్రంలో పొలిటికల్ వార్ ఇప్పుడే ప్రారంభమైందన్న సంకేతాలు వస్తున్నాయి.

ఇది చదవండి: తెలంగాణ ప్రజలకు అలర్ట్​.. నేటి నుంచే కొత్త చట్టం అమలు.. ఉల్లంఘిస్తే జరిమానే..


Published by:Siva Nanduri
First published:

Tags: Bjp, Kishan Reddy, Telangana Politics, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు