Home /News /telangana /

TS POLITICS UNION MINISTER KISHAN REDDY SAID THAT ALL THE LEADERS WHO DID NOT PARTICIPATE IN THE TELANGANA MOVEMENT FOR AT LEAST ONE DAY ARE NOW WITH CM KCR PRV

BJP | TRS: తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజూ పాల్గొనని నేతలంతా ఇప్పుడు సీఎం కేసీఆర్‌ పక్కనే..  కేంద్ర మంత్రి విమర్శలు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైల్ ఫోటో

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైల్ ఫోటో

తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజూ పాల్గొనని నేతలంతా ఇప్పుడు సీఎం కేసీఆర్‌ పక్కనే ఉండి బీజేపీపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ పాలనపై విసుగుచెంది కవులు, కళాకారులు, మేధావులు టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారని తెలిపారు.

ఇంకా చదవండి ...
    కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన నిధులు ఏ ఒక్కరోజు ఆలస్యం కాకుండా విడుదల చేస్తున్నా రాష్ట్ర మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిధులు రావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  (Union Minister Kishan Reddy) ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో (Telangana movement) ఒక్కరోజూ పాల్గొనని నేతలంతా ఇప్పుడు సీఎం కేసీఆర్‌ (CM KCR) పక్కనే ఉండి బీజేపీ (BJP)పై విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ పాలనపై విసుగుచెంది కవులు, కళాకారులు, మేధావులు టీఆర్‌ఎస్‌ (TRS)కు దూరంగా ఉంటున్నారని తెలిపారు. ముషీరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్‌ అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి కిషన్‌రెడ్డి హాజరై మాట్లాడారు.

    యూపీఏ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి..

    బీజేపీ (BJP)పై కల్వకుంట్ల కుటుంబం విషప్రచారం చేస్తోందని, అయినా ప్రజలు టీఆర్‌ఎస్‌ (TRS)ను నమ్మడంలేదని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి పట్టంకట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఎనిమిదేళ్ల పాలనలో దేశకీర్తి ప్రతిష్టలు పెంచారని కొనియాడారు. గత యూపీఏ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి కుంభకోణాలే వెలుగుచూశాయని, మోదీ ప్రధాని పదవి చేపట్టి అవినీతి మచ్చలేకుండా దేశాన్ని పురోభివృద్ధికి తీసుకెళ్తున్నారని ప్రశంసలు కురిపించారు. వచ్చే ఎన్నికల్లోనూ మోదీ, అమిత్‌షాల సారథ్యంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మెర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

    మరోవైపు కరీంనగర్​లో జరిగిన బీజేపీ సమావేశంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ టీఆర్​ఎస్​పై విమర్శలు గుప్పించారు.  తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుందని బీజేపీ  ఈటల రాజేందర్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి నియంతృత్వ పోకడలు తప్ప.. ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదన్నారు. సీఎం కేసీఆర్ తానే రాజుగా ..చక్రవర్తిగా అనుకుంటున్నారని..తాను ఏం చేసినా చెల్లుంతుందనే భ్రమలో ఉన్నారని ఈటల ఆరోపించారు. కావాలనే బీజేపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయాలన్నారు. గెలుపే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

    గ్రామస్థాయిలో కూడా బీజేపీ సర్పంచ్ లు ఉండాలని ఆయన సూచించారు. ఎన్నో ఒడుదొడుకులు, కష్టాలు ఎదుర్కొంటేనే రాజకీయాల్లో రాణిస్తారని చెప్పారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టినప్పుడు వాళ్లకు కార్యకర్తలు లేరు. కానీ అధికారంలోకి వచ్చారు. మనకు కేంద్ర ప్రభుత్వం అండ ఉందని..ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి పెంచిన ఛార్జీల వల్ల 20 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తోందన్నారు. మద్యం ధరలు పెంపుతో రాష్ట్రానికి 40 వేల కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు.

    తాగుడుకు బానిసలయ్యారు..

    రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా ఏ సమయంలోనైనా మద్యం సీసా దొరుకుతుందన్నారు. రాష్ట్రంలో 6.80 లక్షల మంది ప్రజలు తాగుడుకు బానిసయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యంపై కేంద్రం ఇచ్చే సబ్సిడీ రూ. 7 వేల కోట్లైతే... రాష్ట్రం ఇచ్చేది రూ. 2 వేల కోట్లు మాత్రమే అన్నారు ఈటల.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bjp, Kcr, Kishan Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు