తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని.. ఆయన స్థానంలో మాజీమంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను(Etela Rajendar) నియమిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరూ స్పందించకపోవడంతో ఇది నిజమేనేమో అనేంతగా చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీలో తనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈటల రాజేందర్ కోరడం.. కొద్దిరోజుల క్రితం ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో మాట్లాడటం వంటి అంశాలు కూడా ఈ వార్తలకు ఊతమిచ్చాయి. అయితే తాజాగా ఈ ఊహాగానాలకు తెలంగాణ బీజేపీ ముఖ్యనేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) చెక్ చెప్పారు.
తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పులు ఉండవని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. ప్రస్తుతం ఉన్న టీమ్‌తోనే ఎన్నికలకు వెళతామని అన్నారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి అభ్యర్థులు లేరనే అంశంపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. ఎన్నికలు వస్తే బీజేపీకి ప్రజలే అభ్యర్థులను ఇస్తారని అన్నారు. తమకు నాయకత్వ సమస్య లేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణ బీజేపీలో మార్పులపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇవ్వడంతో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ బండి సంజయ్(Bandi Sanjay) సారథ్యంలోనే ఎదుర్కోబోతోందనే విషయంలో దాదాపుగా స్పష్టత వచ్చింది. ఇక తెలంగాణ బీజేపీలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఈటల రాజేందర్‌కు బండి సంజయ్‌కు మధ్య అంతగా సఖ్యత లేదని.. ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రస్తుతం పార్టీలో చేరికల కమిటీకి కన్వీనర్‌గా ఉన్న ఈటల రాజేందర్.. పార్టీలోకి నాయకులను తీసుకురావడంలో అంతగా సక్సెస్ కావడం లేదనే చర్చ కూడా ఉంది.
Ponguleti Srinivas Reddy: పొంగులేటికి పొగ.. పొమ్మనలేకేనా? సంక్రాంతి తర్వాత కీలక నిర్ణయం.!
KCR: సంక్రాంతి తరువాత తెలంగాణలో కొత్త పార్టీ.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు.. కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ..
బీజేపీ జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు చేరికలకు సంబంధించి రాష్ట్ర పార్టీ నేతలకు సూచనలు, సలహాలు ఇస్తున్నా.. వాళ్లు ఆశించిన స్థాయిలో మాత్రం పార్టీలోకి వలసలు లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్టీలోకి కొత్త వారిని తీసుకొచ్చేలా ప్రయత్నించాల్సిన ఈటల రాజేందర్.. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయ్యేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఇలాంటి వార్తలు జోరుగా వినిపిస్తుండగా.. తాజాగా కిషన్ రెడ్డి దీనిపై స్పందించి.. ఇదే టీమ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందని చెప్పడంతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Etela rajender, Kishan Reddy, Telangana