హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kishan Reddy: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. బీజేపీ అదే కోరుకుంటోందంటూ..

Kishan Reddy: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. బీజేపీ అదే కోరుకుంటోందంటూ..

కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana: సానుభూతి కోసం, హీరోయిజం చూపించుకోవడం కోసం కేసీఆర్ ప్రభుత్వం రోజుకో తప్పు చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో ముందస్తు ఎన్నికల రావాలని బీజేపీ కోరుకుంటోందా ? అనే అంశంపై కేంద్రమంత్రి, బీజేపీ ముఖ్యనేత కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఏడాదిలో ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటున్నామని.. ఈ విషయంలో తమకు ఎలాంటి తొందరలేదని కిషన్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం, పార్టీ ప్రజాస్వామ్యం ఆధారంగా నడుస్తుందని చెప్పారు. సానుభూతి కోసం, హీరోయిజం చూపించుకోవడం కోసం కేసీఆర్ ప్రభుత్వం రోజుకో తప్పు చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అయితే తెలంగాణ(Telangana) ప్రజలపై తమకు పూర్తి నమ్మకం ఉందని.. ఎన్నికలు ఎఫ్పుడు జరిగినా విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి(Shashidar Reddy) బీజేపీలోకి రావడం పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.

తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. కుటుంబ పాలన, అహంకార పూరిత పాలన పోవాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్​ బరితెగించి అధికార దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణకు దిక్కు అనేలా పాలన నడుస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి ఆగిపోయిందని ఆయన విమర్శించారు. తన కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపైనే కేసీఆర్​ దృష్టి పెట్టారన్నారు. అందుకే బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కల్వకుంట్ల కుటుంబం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్​ పార్టీ దుందుడుకు విధానాలతో తన గోతిని తానే తవ్వుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.

అంతకుముందు మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి శర్బానంద్ సోనేవాల్ మర్రి శశిధర్ రెడ్డికి బీజేపీ సభ్యత్వం అందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , బీజేపీ నేతలు డాక్టర్ లక్ష్మణ్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్ , డీకే అరుణ, ధర్మపురి అరవింద్ సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మర్రి శశిధర్ రెడ్డికి కేంద్ర మంత్రి బీజేపీ సభ్యత్వం అందించారు.

బ్రేకింగ్: తెలంగాణ ప్రభుత్వానికి షాక్..బిఎల్ సంతోష్ కు ఊరట

Big News: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్..ఓ వైపు నోటీసులు..మరోవైపు రిమాండ్ పొడిగింపు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని శశిధర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దె దించేవరకు తాను పోరాటం నిర్వహిస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. కొద్దిరోజుల క్రితమే హోంశాఖ మంత్రి అమిత్ షాతో మర్రి శశిదర్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుండి బహిష్కరించారు. మూడు రోజుల క్రితం మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా నేడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

First published:

Tags: Kishan Reddy, Telangana

ఉత్తమ కథలు