Home /News /telangana /

TS POLITICS UNION HOME MINISTER AND SENIOR BJP LEADER AMIT SHAH COMING TO MUNUGODA ON 21ST THIS IS THE COMPLETE SCHEDULE OF HIS VISIT PRV

Amit Shah | Munugodu: ఈ నెల 21న మునుగోడుకు అమిత్​ షా.. పర్యటన పూర్తి షెడ్యూల్​ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. ఉపఎన్నికల్లో (Munugode Bypolls) గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహ రచనలో బిజీగా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India
    తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) చాలా రోజులుగా మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. ఉపఎన్నికల్లో (Munugode Bypolls) గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహ రచనలో బిజీగా ఉన్నాయి. పోటా పోటీగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. ముందుగా అధికార టీఆర్ఎస్ (TRS) పార్టీ మునుగోడులో ఈ నెల 20న భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఆ సభ వేదికగా మునుగోడుపై సీఎం కేసీఆర్ (CM KCR) వరాలు జల్లు కురిపించే అవకాశముంది. అలాగే అభ్యర్థిపైనా ప్రకటన చేస్తారు. ఆ మరుసటి రోజే బీజేపీ సభ జరగనుంది. ఐతే ఆగస్టు 21న బీజేపీ సభ జరగకపోవచ్చని.. హోంమంత్రి అమిత్ షా (Amit Shah Munugode Meeting) కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ ఢిల్లీ నుంచి సమాచారం అందడంతో.. ఆగస్టు 21నే సభను నిర్వహించనున్నారు. ఆ సభా వేదికగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy RajagopalReddy) తో పాటు మరికొందరు నేతలు బీజేపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లలో బీజేపీ నేతలు బిజీ అయ్యారు. మునుగోడు బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం బీజేపీ నాయకులు పరిశీలించారు. డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి సభా స్థలిని సందర్శించారు. పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.

    ఇక అమిత్​ షా పర్యటన పూర్తి షెడ్యూల్​ పరిశీలిస్తే..

    ఈనెల 21న మునుగోడులో భారీ బహిరంగ సభ ఉండనుంది.

    ఆగస్టు 21న మధ్యాహ్నం 3.30 గంటలకు అమిత్ షా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

    అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్​లో బయలుదేరి సాయంత్రం నాలుగున్నర గంటలకు మునుగోడుకు చేరుకుంటారు.

    సాయంత్రం 5 గంటలకు మునుగోడులో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్​ షా పాల్గొంటారు. ఇదే సభలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సహా పలువురు నాయకులను భాజపాలోకి ఆహ్వానించనున్నారు.

    అదే రోజు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు అమిత్​ షా బయలుదేరుతారు.

    జనగామలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షన ఈ భేటీ జరిగింది. అమిత్ షా సభకు భారీగా జన సమీకరణ చేయాలని నేతలకు ఆయన సూచించారు. అంతేకాదు జన సమీకరణ, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఒక్కో మండలానికి ఇద్దరు సీనియర్ నేతల చొప్పున ఇంఛార్జీలుగా నియమించారు. కొత్తగా ఏర్పాటైన గట్టుప్పల్ మండలంతో సహా మునుగోడు నియోజకవర్గంలోని మొత్తం ఏడు మండలాలు రెండు మున్సిపాలిటీల బాధ్యతను 18 మంది సీనియర్ నాయకులకు అప్పగించారు.

    భద్రతపై సమీక్ష..

    కాగా, అమిత్ షా మునుగోడు పర్యటన నేపథ్యంలో సీఆర్పీఎఫ్‌ అధికారులు రాష్ట్ర పోలీస్ అధికారులతో భద్రతపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అమిత్‌షా వస్తుండటంతో.. సభకు పెద్దఎత్తున జనాన్ని తీసుకొచ్చేందుకు నేతలు శ్రమిస్తున్నారు.  ఇప్పటికే జన సమీకరణ, ఇతర ఏర్పాట్ల కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వం.. మండలానికి ఇద్దరు చొప్పున ఇంఛార్జ్‌లను నియమించింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Amit Shah, Bjp, Munugodu By Election, Telangana Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు