టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి గోడకు టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు అంటించింది. రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో.. ఆయన ఇంట్లోని సిబ్బందిని నోటీసులు తీసుకోవాలని కోరారు. అయితే ఇందుకు వాళ్లు నిరాకరించారు. దీంతో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇంటి గోడకు నోటీసులు అంటించారు. పేపర్ల లీకేజీపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని.. ఇందుకోసం ఈ నెల 23న ఉదయం 11 గంటలకు సిట్ (SIT) ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందించారు. సిట్ నోటీసులను స్వాగతిస్తున్నానని అన్నారు. అయితే ఈ వ్యవహారంలో కేటీఆర్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని కోరారు.
సిట్ నోటీసులపై స్పందిస్తానని.. వివరణ ఇస్తానని తెలిపారు. సిట్‌కు తన దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తానని చెప్పారు. సిట్ అధికారి శ్రీనివాస్.. కేటీఆర్ బావమరిది అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ అన్నందుకే తనకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఇది కచ్చితంగా రాజకీయ కక్షే అని విమర్శించారు. కేటీఆర్‌కు కూడా సిట్ నోటీసులు ఇవ్వాలని.. లేకపోతే దీనిపై హైకోర్టుకు వెళతానని రేవంత్ రెడ్డి అన్నారు.
అంతకుముందు పేపర్ లీక్ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే మండలంలో వంద మందికి ర్యాంకులు వచ్చాయని తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సిట్ సీరియస్‌గా తీసుకుంది. దీంతో, రేవంత్ వద్ద ఉన్న ఆధారాలను తమకు అందించాలని సిట్ ఏసీపీ కోరారు. ఇక, రేవంత్ ఇటీవలే పేపర్ లీక్ అంశంలో కేటీఆర్(KTR) పీఏ తిరుపతి పాత్ర కూడా ఉందన్నారు.
హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న మామిడి పండ్ల ధరలు.. ఇదే కారణం.. !
KTR: అవన్నీ ప్రజలకు వివరించండి.. బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ పిలుపు.. పార్టీ ప్లీనరీపై క్లారిటీ
ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు, వివరాలు కూడా ఇవ్వాలని సిట్ పేర్కొంది. ఈ మేరకు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులను గోడకు అంటించింది. ఈ అంశంలో ఇప్పటివరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా రాజకీయం నడుస్తుండగా... రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు ఇవ్వడంతో సీన్ మారుతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయ రగడ సాగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Revanth Reddy, Telangana