Home /News /telangana /

TS POLITICS TS GOVERNOR TAMILISAI SENSATIONAL COMMENTS ON CM KCR TRS GOVT AFTER MEETING PM MODI AMIT SHAH IN DELHI MKS

KCR విషయంలో కేంద్రం గేరు మార్చిందా? -PM Modiతో భేటీ తర్వాత గవర్నర్ సంచలన వ్యాఖ్యలకు అర్థమేంటి?

ప్రధాని మోదీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై

ప్రధాని మోదీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై

కేంద్రంపై కేసీఆర్ కోపానికి వరి వివాదం కంటే వ్యక్తిగత, రాజకీయ కారణాలే ఉన్నాయనే విషయాన్ని కమలనాథులు హైలైట్ చేయనున్నారా? పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ వివాదాన్ని గవర్నర్ తమిళిసై ఢిల్లీలో ప్రస్తావించడానికి కారణాలేంటి?

ధాన్యం కొనుగోలు వ్యవహారాన్ని వరి పోరుగా మార్చి బీజేపీపై యుద్ధంలో భాగంగా ఢిల్లీలోనూ దీక్షకు సిద్దమవుతోన్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో కేంద్రం ఆలోచన మారిందా? తెలంగాణకు సంబంధించి ఢిల్లీలో వరుస పరిణామాల తర్వాత గవర్నర్ తమిళిసై ఆగ్రహపూర్తిత వ్యాఖ్యలకు అర్థమేంటి? కేంద్రంపై కేసీఆర్ కోపానికి వరి వివాదం కంటే వ్యక్తిగత, రాజకీయ కారణాలే ఉన్నాయనే విషయాన్ని కమలనాథులు హైలైట్ చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

వ్యక్తిగత కారణాలతోపాటు వరి పోరును ఉధృతం చేసేందుకు సీఎం కేసీఆర్ హస్తినంలో మకాం వేసిన సమయంలోనే టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ కేంద్రం పెద్దలను కలిసివెళ్లారు. ఇవాళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఢిల్లీ పెద్దలను కలిశారు. రాష్ట్రంలో సీఎం వర్సెస్ గవర్నర్ లేదా రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్లుగా వ్యవహారాలు సాగుతోన్న దరిమిలా తమిళిసై ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఊహించినట్లుగానే కేంద్రం పెద్దలను కలిసిన తర్వాత గవర్నర్ స్వరం కాస్త మారింది..

ప్రధాని మోదీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై

CM KCR: పన్ను పీకించుకొని కేసీఆర్ తిరుగుటపా! -ఢిల్లీ వరి దీక్షకు సీఎం పక్కాగా వెళతారా?


కేంద్ర హోం మంత్రి అమిత్ షా పులుపు మేరకు మంగళవారం రాత్రి ఢిల్లీ వచ్చిన తెలంగాణ గవర్నర్ తమిళిసై బుధవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. గదర్నర్ తొలుత అమిత్ షాను కలిసి, ఆ తర్వాత మోదీని కలుస్తారని భావించినా, ముందుగానే మోదీని కలవడం గమనార్హం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను ఈ సందర్భంగా ప్రధానికి ఆమె వివరించినట్లు తెలుస్తోంది. గవర్నర్ వరుస అవమానాలకు గురవుతోన్న ప్రొటోకాల్‌ వివాదాలపై ప్రధాని వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కాగా, ప్రధాని మోదీతో భేటీ తర్వాత గవర్నర్‌ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు..

Telangana Governor: అమిత్ షాతో తమిళిసై భేటీ.. KCR తీరుపై ఫిర్యాదు?.. సీఎం ఢిల్లీలో ఉండగానే..


రాజ్ భవన్ తో ప్రగతి భవన్ కు అసలు తగాదా ఎక్కడ, ఎలా మొదలైందనే అంశాన్ని వివరించేందుకు గవర్నర్ ప్రయత్నినంచారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంలో పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ నామినేట్ చేయడం, ఆ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించడం తెలిసిందే. ఇవాళ ఢిల్లీ ప్రెస్ మీట్ లో గవర్నర్ మాట్లాడుతూ.. ‘గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ నియామకంలో వివాదమేమీ లేదు. సేవా రంగం నుంచి ప్రభుత్వం ఒక పేరును నాకు ప్రతిపాదించింది. అయితే అసలా వ్యక్తి(కౌశిక్ రెడ్డి) ఎలాంటి సేవా చేయలేదని నాకు తెలియవచ్చింది. ఇదే అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాను’అని తమిళిసై అన్నారు.

మోదీకి వినాయక విగ్రహం అందజేసిన తమిళిసై

Ukraine War: రెండుగా చీలిన ప్రపంచం.. ఇండియాది మానవత్వం.. వాళ్లను కూలగొడతాం: PM Modi


తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, రాజ్యంగ వ్యవస్థలను గౌరవించాలని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రొ టోకాల్‌ పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కు ప్రొ టోకాల్‌ తెలియదా? అని గవర్నర్ ప్రశ్నించారు. వ్యక్తిని కాకుండా వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలని హితవుపలికారు. తాను వివాదాలు కోరుకోనని, వ్యక్తిగతంగా ఇగోలకు పోయేదాన్ని కానని తమిళిసై చెప్పుకున్నారు. మంత్రులు, అధికారులను రాజ్ భవన్ వెళ్లనీయకుండా ప్రగతి భవన్ కట్టడి చేస్తోందనే ఆరోపణలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రాజ్‌భవన్‌కు సీఎం, మంత్రులు ఎప్పుడైనా రావొచ్చని, ఎవరైనా సమస్యలను తన దృష్టికి తీసుకురావొచ్చని, తనకెంలాంటి ఇగోలు లేవని, తాను వివాదాస్పద వ్యక్తిని కాదని గవర్నర్ అన్నారు.

Jogipet జాతిరత్నాలు: తాగిన మైకంలో అబ్బాయికి తాళి కట్టాడు.. వాడేమో కాపురం చేస్తానని ఇంటికొచ్చాడు!


సీఎం తో విబేధాల క్రమం, కేంద్రంపై టీఆర్ఎస్ పోరాటం అంశాల నేపథ్యంలో గులాబీ బాస్ ఢిల్లీలో ఉండగానే గవర్నర్ వచ్చి పెద్దలను కలవడం, మోదీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ టీ సర్కారుపై పరోక్ష విమర్శలు చేయడాన్ని బట్టి కేసీఆర్ విషయంలో కేంద్రం గేరు మార్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే గవర్నర్ మాత్రం తాను ఢిల్లీకి వచ్చింది కేసీఆర్ సర్కారుపై ఫిర్యాదు చేయడానకి మాత్రమే కాదని, తెలంగాణ ప్రజలంటే తనకెంతో ఇష్టమని, రాష్ట్రంలో ఆస్పత్రుల్లో సౌకర్యాల మెరుగు, గిరిజన ప్రాంతాల్లో వసతుల కల్పన కోసం సాయం చేయాల్సిందిగా ప్రధానిని కోరానని తమిళిసై పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Amit Shah, Bjp, CM KCR, Governor Tamilisai, Pm modi, Tamilisai Soundararajan, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు