Home /News /telangana /

TS POLITICS TRS WORKING PRESIDENT KTR SLAMS BJP IN WARANGAL OF TELANGANA PRAISES CM KCR AK

KTR| BJP: అలాగని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా.. బీజేపీకి కేటీఆర్ సవాల్..

కేటీఆర్​, బండి సంజయ్​ (ఫైల్​ ఫొటోలు)

కేటీఆర్​, బండి సంజయ్​ (ఫైల్​ ఫొటోలు)

Telangana: తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు రాష్ట్రం కోసం ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. నలుగురు బీజేపీ ఎంపీలు ఎప్పుడైనా ప్రధానిని కలిశారా ? అని ఎద్దేవా చేశారు.

    తెలంగాణకు కేంద్రం ఇచ్చిన దానికంటే.. కేంద్రానికి తెలంగాణ ఇచ్చిన నిధులే ఎక్కువ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తాను చెప్పినది తప్పు అని బీజేపీ నేతలు నిరూపిస్తే.. వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3, 65,797 కోట్లు ఇస్తే... కేంద్రం నుంచి తెలంగాణ‌కు వ‌చ్చింది కేవ‌లం రూ.1,68,647 కోట్లేన‌ని కేటీఆర్ అన్నారు. ఈ మాట త‌ప్పయితే మంత్రి పదవిని ఎడ‌మ కాలికి ఉన్న చెప్పులా వ‌దిలేస్తాన‌ని వ్యాఖ్యానించారు. మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశాక సాధార‌ణ ఎమ్మెల్యేగానే తాను కొన‌సాగుతాన‌ని కేటీఆర్ అన్నారు.

    ద‌మ్ముంటే బీజేపీ నేత‌లు తాను చేసిన వ్యాఖ్యలు తప్పు అని నిరూపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు రాష్ట్రం కోసం ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. నలుగురు బీజేపీ ఎంపీలు ఎప్పుడైనా ప్రధానిని కలిశారా ? అని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి వెన్నుముక లేని నాయకుడని అన్నారు. ఏదిపడితే అది తిడితే.. ఇక తిరగబడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ ఒక గొప్ప నాయకుడని కేటీఆర్ కొనియాడారు.

    ఎన్టీఆర్‌లా కేసీఆర్ సినిమా స్టార్ కాక‌పోయిన‌ప్పటికీ.. గుండె నిండా ఆత్మవిశ్వాసంతో 20 ఏళ్ల క్రితం ఒక్కడే తెలంగాణ సాధన కోసం బయలుదేరారని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో విపక్షాలు అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణలో కేసీఆర్ పార్టీ పెట్టి ముందుకు సాగారని కేటీఆర్ గుర్తు చేశారు.

    Kishan Reddy: ఆ 4.53 లక్షల ధాన్యం బస్తాలు ఏమయ్యాయి ? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    CM KCR vs Governor: గిల్లికజ్జాలు.. తమిళిసై అత్యుత్సాహం: తలసాని సంచలనం

    మీడియా ప‌వ‌ర్, మ‌నీ ప‌వ‌ర్, మ‌జిల్ ప‌వ‌ర్, క్యాస్ట్ పవర్ లేకపోయినా.. గుండె బలంతో కేసీఆర్ ముందుకు సాగారని అన్నారు. అలాంటి కేసీఆర్ మీద ఇప్పుడు కొందరు నాయకులు కుక్కల్లా మొరుగుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: KTR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు