టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి నేతలు చాలామందే ఉన్నారు. వారిలో మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అనేక నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లో గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఆ నియోజకవర్గాల్లో పాత, కొత్త నాయకుల మధ్య చాలాకాలం నుంచి రాజకీయ పోరు సాగుతోంది. తాండూరు వంటి పలు నియోజకవర్గాల్లో ఇది పతాకస్థాయిలో ఉంది. అయితే గతంలో ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు.. ఆ తరువాత టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేశారు. వారిలో అనేక మంది విజయం సాధించారు. దీంతో 2018 తరువాత ఇతర పారట్ల నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలు సైతం ఈసారి టీఆర్ఎస్ తరపున టికెట్ తమకే వస్తుందని.. గతంలో మాదిరిగానే కేసీఆర్ ఈసారి వ్యవహరిస్తారని భావించారు.
కానీ ఇప్పడు తెలంగాణలో పరిస్థితులు మారాయి. టీఆర్ఎస్ కూడా అందుకు తగ్గట్టుగానే మారాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా స్పష్టంగా తెలిపారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. పీకే సర్వేలో మెరుగైన ఫలితాలు వచ్చిన వారికే టికెట్లు వస్తాయని కుండబద్ధలు కొట్టారు. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నేతల్లో మళ్లీ ఆశలు మొదలైనట్టు కనిపిస్తోంది.
ఇప్పటివరకు టీఆర్ఎస్‌లో తమకు టికెట్ రాదని డిసైడైన కొందరు నేతలు.. బీజేపీ సహా పలు ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరిలో కొంతమంది ఆ దిశగా సమాలోచనలు కూడా జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా టీఆర్ఎస్ అధినాయకత్వం గతానికి భిన్నంగా గెలుపు అవకాశాలు ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని కచ్చితంగా నిర్ణయం తీసుకున్న తరుణంలో.. తమకు కూడా మళ్లీ అవకాశం వస్తుందనే ఆశలో కొందరు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.
KCR| YS Jagan: జగన్ ఇచ్చిన ఛాన్స్ కేసీఆర్ ఇచ్చే అవకాశం లేదా ?.. టీఆర్ఎస్‌లో చర్చ
Vundavalli on KCR: కేసీఆర్ క్లారిటీతో ఉన్నారు.. నన్ను అలా చేయమన్నారు.. ఉండవల్లి వివరణ
ఈ క్రమంలో పార్టీ మారాలనే ఆలోచనను కొందరు నేతలు విరమించుకున్నారని.. నియోజకవర్గంలో తమ గెలుపు అవకాశాలు మెరుగుపరుచుకుంటే.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశం మళ్లీ తమకే వస్తుందని ఆయా నేతలు భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం నియోజకవర్గం పరిధిలో పర్యటనలు చేస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మారిన టీఆర్ఎస్ వ్యూహం.. ఆ పార్టీలోని కొందరి నేతల ఆలోచనలు కూడా మారేలా చేసినట్టు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.