టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఆ పార్టీ నిర్వహిస్తున్న ప్రచారాన్ని బట్టి అర్థమవుతోంది. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు మునుగోడులో తమకు పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తమకు అప్పగించిన యూనిట్లలో మెజార్టీ ఓట్లు సాధించడం ఎలా అనే అంశంపై ఫోకస్ చేశారు. అయితే మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫోకస్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేటీఆర్ మునుగోడులో(Munugodu) టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యారు. సాధారణంగా తెలంగాణలో జరిగిన పలు ఉప ఎన్నికలకు కేటీఆర్(KTR) దూరంగా ఉంటూ వచ్చారు. నాగార్జునసాగర్, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి కేటీఆర్ వెళ్లలేదు. కేవలం మీడియా ద్వారానే అక్కడి ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
అయితే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం కోసం కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగడం హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను మంత్రి కేటీఆర్, హరీశ్ రావులకు కేసీఆర్ అప్పగించారని కొద్దిరోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హరీశ్ రావు ఇంకా మునుగోడుపై ఫోకస్ చేయలేదు. కేటీఆర్ మాత్రం రంగంలోకి దిగారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తరువాత ఆ పార్టీ ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు ఉన్న హరీశ్ రావు ఇమేజ్ కొంతమేర డ్యామేజ్ అయ్యింది. ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించింది.
దీంతో మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించే బాధ్యతలను కేసీఆర్.. కేటీఆర్, హరీశ్ రావులకు అప్పగించారు. దీంతో ఈసారి విజయం కోసం ఇద్దరూ రంగంలోకి దిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్ లాంటిదని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇక్కడ తాము గెలిచి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదే అని చాటిచెబుతామని పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కూడా ఈ ఉప ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకుంది.
Munugodu By-Poll: నేనే మునుగోడును దత్తత తీసుకుంటా..నామినేషన్ ర్యాలీలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Munugode Bypolls: మంత్రిని కూడా వదల్లేదు.. మునుగోడులో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు
ఇక్కడ ఎలాగైనా బీజేపీకి బ్రేకులు వేసి.. తెలంగాణలో రాజకీయ ఆధిపత్యం తమదే అనే విషయాన్ని చాటి చెప్పాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. మరోవైపు నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాబోయే రోజుల్లోనూ మునుగోడులో స్వయంగా ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి పలు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న కేటీఆర్.. మునుగోడు విషయంలో రంగంలోకి దిగాల్సిన పరిస్థితి రావడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: KTR, Munugodu By Election, Telangana