హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR: మునుగోడు ఉప ఎన్నికలో పోటీ ఎవరి మధ్య.. కేటీఆర్ ట్వీట్.. గతంలో అలా ఉండేదంటూ..

KTR: మునుగోడు ఉప ఎన్నికలో పోటీ ఎవరి మధ్య.. కేటీఆర్ ట్వీట్.. గతంలో అలా ఉండేదంటూ..

కేటీఆర్, మునుగోడు (ప్రతీకాత్మక చిత్రం)

కేటీఆర్, మునుగోడు (ప్రతీకాత్మక చిత్రం)

KTR| Munugodu: టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత యుద్ధప్రాతిపదికన శాశ్వతంగా ఈ సమస్య తీర్చిన మాట వాస్తవమని కేంద్రమే పార్లమెంట్లో చెప్పిందని కేటీఆర్ అన్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. మరో నెల రోజుల్లో ఈ ఉపఎన్నిక జరగనుంది. దీంతో అప్పుడే రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. తాజాగా ఈ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) ట్వీట్ చేశారు. మునుగోడులో(Munugodu) జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ ? అని ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్గొండ బిడ్డలకి శాపంలా ఇచ్చిన కాంగ్రెస్.. ఫ్లోరోసిస్ నిర్ములనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు(Mission Bhageeratha) పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ.. ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన టీఆర్ఎస్ అని తన ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధాని టేబుల్ మీద ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి చిత్రం ఆనాటి దుస్థితికి సాక్ష్యమని.. అప్పటి ఫోటోను ట్వీట్‌ చేశారు.

  దశాబ్దాలు అధికారంలో ఉన్నా స్వయంగా ప్రధానికి మొరపెట్టుకున్నా పైసా ఇవ్వలేదు, పరిష్కారం కాలేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత యుద్ధప్రాతిపదికన శాశ్వతంగా ఈ సమస్య తీర్చిన మాట వాస్తవమని కేంద్రమే పార్లమెంట్లో చెప్పిందని అన్నారు.

  మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనే అంశంపై గులాబీ బాస్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయడం ఖాయమనే సంకేతాలు ఇప్పటికే టీఆర్ఎస్ వర్గాల్లోకి వెళ్లిపోయాయి.

  YS Sharmila : YS షర్మిలపై మరో పోలీస్ కంప్లైంట్ .. SC,ST చట్టం కింద కేసు నమోదు చేయాలంటున్న దళిత సంఘాలు

  Photos: షాకింగ్.. పోలీసులపై కోపంతో బైక్‌ను తగలబెట్టుకున్న వ్యక్తి.. హైదరాబాద్‌లోనే..

  కేసీఆర్ ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉండటం దాదాపు ఖాయమే అని పార్టీ నేతలు చెబుతున్నారు. దసరా రోజున జాతీయ పార్టీపై ప్రకటన చేయనున్న కేసీఆర్.. అదే రోజు మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతలు జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి సహా పలువురు నేతలకు అప్పగించిన సీఎం కేసీఆర్.. అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: KTR, Munugodu By Election, Telangana