పొలిటికల్ వార్ కు సోషల్ మీడియా వేదికగా మారిన తర్వాత.. యాక్టివ్ గా స్పందించే నేతలను ప్రత్యర్థులు ‘ట్విటర్ పిట్ట’అనో, ‘ట్వీటు వీరుడు’ అనో ఎద్దేవా చేస్తుండటం తెలిసిందే. అయితే ఇప్పుడు టిల్లూ పేరు సైతం గప్పాలకు ప్రత్యామ్నాయంగా మారింది. ‘అట్లుంటది మనతోని..’అంటూ ‘డీజే టిల్లూ’ సినిమా హిట్ అయిన తర్వాత ఆ టైటిల్, హీరో డైలాగ్ మాడ్యులేషన్ గురించి రాజకీయ నేతలూ తరచూ ప్రస్తావిస్తున్నారు. తాజాగా టీబీజేపీ చీఫ్ బండి సంజయ్.. టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ను ‘ట్విటర్ టిల్లూ’గా అభివర్ణిస్తూ ఎద్దేవా చేశారు. ఈడీ దాడుల బెదిరింపు క్రమంలో వీరి మధ్య మాటల యుద్ధం సాగిందిలా..
కల్వకుంట్ల కుంటుంబం లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని, సీఎం కేసీఆర్ ను తొందర్లోనే జైలుకు పంపుతామని బీజేపీ నేతలు గత రెండేళ్లుగా వార్నింగ్స్ ఇస్తున్నా.. ఆ దిశగా ఇంచుకూడా కదలిక లేదు. కేసీఆర్ పై కనీసం బీజేపీ నేతలైనా ఫిర్యాదు చేసిన దాఖలాలూ లేవు. జైలు బెదిరింపుల క్రమంలో కేసీఆర్ సైతం గతంలోనే ఘాటుగా స్పందిస్తూ.. దమ్ముంటే ఈడీనీ రమ్మనాలని బీజేపీకి ప్రతిసవాలు విసిరారు. అయినాసరే కమలదళం పదేపదే అదే సవాలును ప్రయోగిస్తూ వచ్చింది.
బీజేపీ బైక్ ర్యాలీల సందర్భంగా గురువారం నాడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై ఈడీ నజర్ వేసిందని, త్వరలోనే దాడులు జరుపుతుందని హెచ్చరించడం తాజా రచ్చకు దారి తీసింది. సీఎం కేసీఆర్ పై ఈడీ దాడి చేయబోతోందని బండి సంజయ్ చెప్పడాన్ని బట్టి.. బహుశా బండిని ఈడీ చీఫ్ గా ప్రధాని మోదీ నియమించారేమో అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘బండి సంజయ్‌ని ఈడీ చీఫ్‌గా నియమించిన ప్రధానికి కృతజ్ఞతలు. దేశాన్ని నడుపుతున్న డబుల్ ఇంజిన్ మోదీ, ఈడీ అని దీంతో అర్థమవుతున్నది’అని టీఆర్ఎస్ నేత పంచ్ విసిరారు. దీనికి..
Dear @PMOIndia
Thanks for appointing your BJP state president Sri BS Kumar as the Chief of ED also ????????
Now we realise double engine that runs this country is actually “Modi & ED” #ModiGovt pic.twitter.com/IlyOcbh9ty
— KTR (@KTRTRS) July 22, 2022
ఈడీ చీఫ్ బండి.. అంటూ కేటీఆర్ ఇచ్చిన పంచ్ కు సంజయ్ అనూహ్య కౌంటర్ విసిరారు. దర్యాప్తు సంస్థల పేరెత్తగానే ట్విట్టర్ టిల్లూ లాంటి దోపిడీదారుల్లో భయం పతాకస్థాయికి చేరిందని సెటైర్ వేశారు. ‘దర్యాప్తు సంస్థలు మీ తలుపు తట్టే వరకు యోగా చేయండి. ఊపిరి పీల్చుకోండి’ అంటూ ట్వీట్ చేసిన బండి.. ట్విట్టర్ టిల్లూ అని హ్యాష్‌ట్యాగ్ జతచేశారు.
The signs of fear among robbers especially Twitter Tillu, is at all time high...
Yoga is good for people experiencing anxiety... Suggest to inhale and exhale until investigative agencies knock your door.#TwitterTillu
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 22, 2022
మొత్తానికి, ఈడీ పేరుతో బెదిరింపులే తప్ప ఇప్పటిదాకా ఫిర్యాదులు చేయని బీజేపీ ఓవైపు.. మోదీ సర్కారు బండారం బయటపెట్టే ఆధారాలను దేశం ముందు పెడతామన్న టీఆర్ఎస్ నెలలలు గడుస్తోన్నా ఆ పని చేయకపోవడం.. చర్చనీయాంశంగానే ఉంది. నెటిజన్లయితే ‘అట్లుంటయి మరి రాజకీయాలు..’అని నెటిజన్లు రెండు పార్టీలనూ వెక్కిరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, CM KCR, KTR, Minister ktr, Pm modi, Telangana, Trs