హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS-Munugodu: మునుగోడులో గ్రేటర్ వ్యూహం.. టీఆర్ఎస్ వ్యూహం వర్కవుట్ అవుతుందా ?

TRS-Munugodu: మునుగోడులో గ్రేటర్ వ్యూహం.. టీఆర్ఎస్ వ్యూహం వర్కవుట్ అవుతుందా ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: మునుగోడు ఉప ఎన్నికల్లోనూ కేసీఆర్ గ్రేటర్ వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గాన్ని 80కిపైగా యూనిట్లుగా టీఆర్ఎస్ నాయకత్వం విభజించినట్టుగా సమాచారం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉప ఎన్నికను తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్‌తో పోల్చితే ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ రెండు పార్టీలు మునుగోడు (Munugodu) సీటును గెలుచుకోవడంపై తీవ్రంగా ఫోకస్ చేశాయి. తెలంగాణలోని దుబ్బాక, హుజూరాబాద్ సీట్లను ఉప ఎన్నికల్లో గెలుచుకున్న బీజేపీ(BJP) .. మునుగోడును అదే రకంగా సొంతం చేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం తెలంగాణలోని నాయకులతో పాటు జాతీయ నాయకులు కూడా మునుగోడు ఎన్నికల రణక్షేత్రంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు మునుగోడులో గెలుపు కోసం గ్రేటర్ ఎన్నికల వ్యూహాన్ని టీఆర్ఎస్(TRS)  అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది.

గ్రేటర్ ఎన్నికల్లోనూ బీజేపీ , టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. అంతకుముందు టీఆర్ఎస్ గెలుచుకున్న అనేక సీట్లను బీజేపీ గెలుచుకుంది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడంలో మాత్రం టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ఇందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ డివిజన్ స్థాయిలో బాధ్యతలను అప్పగించింది టీఆర్ఎస్. తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లోనూ కేసీఆర్ గ్రేటర్ వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గాన్ని 80కిపైగా యూనిట్లుగా టీఆర్ఎస్ నాయకత్వం విభజించినట్టుగా సమాచారం.

ఆ యూనిట్లలో ఎక్కువ ఓట్లను సాధించే బాధ్యతను టీఆర్ఎస్‌లోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకత్వం వారికి సూచించబోతోంది. ముఖ్యంగా మునుగోడులో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు, ఓటర్లకు సమర్థవంతంగా వివరిస్తే.. గెలుపు తమనే వరిస్తుందనే భావనలో అధికార పార్టీ ఉంది. ప్రతి ఓటరును కలిసేలా నేతలు వ్యూహరచన చేసుకోవాలని ప్రతి ఓటరుతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలని నేతలకు సూచించబోతోంది.

KCR| Munugodu: మునుగోడుపై కేసీఆర్ భారీ ప్లాన్.. ఏకంగా అంతమంది ఎమ్మెల్యేలు రంగంలోకి..?

Telangana : మండవ ఈసారి పోటీ చేయడం పక్కా .. ఏ పార్టీ నుంచంటే..?

గ్రేటర్‌లోనూ టీఆర్ఎస్ నేతలు ఇదే రకమైన వ్యూహాన్ని అమలు చేసింది. చాలా నియోజవకర్గాల్లో విజయం సాధించింది. గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఈ రకమైన ప్లాన్ టీఆర్ఎస్‌కు కలిసొచ్చింది. మునుగోడు గ్రామీణ ప్రాంతం కావడంతో.. అది తమకు కలిసి వచ్చే అంశంగా మారుతుందని గులాబీ పార్టీ భావిస్తోంది. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం గ్రేటర్ వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్న టీఆర్ఎస్.. అక్కడ తాము ఆశిస్తున్న ఫలితాన్ని అందుకుంటుందేమో చూడాలి.

First published:

Tags: CM KCR, Munugodu By Election, Telangana

ఉత్తమ కథలు