హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR-Munugodu: మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ కీలక నిర్ణయం..

KCR-Munugodu: మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ కీలక నిర్ణయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: రేపు మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థి పేరుతో పాటు చండూరులో ఏర్పాటు చేయబోయే సభ తేదీని, అలాగే అభ్యర్థి నామినేషన్ వేయాల్సిన తేదీని కూడా కేసీఆర్ ఖరారు చేయనున్నట్టు సమాచారం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి అంతా ఈ ఉప ఎన్నిక మీదే ఉంది. రేపు జాతీయ పార్టీ ప్రకటన చేసేందుకు సిద్ధమైన కేసీఆర్... అంతకంటే ముందుగానే ఈ రోజు ఈ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్ష నిర్వహించారు. మునుగోడు(Munugodu) అభ్యర్థిగా ఉండబోయే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రావుతో పాటు మంత్రి హరీశ్ రావు(Harish Rao)  ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఈ సమీక్షలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. తాము ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ పేరు మీదే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో కేసీఆర్(KCR) ఉన్నారని.. ఇదే అభిప్రాయాన్ని ఆయన ఈ సమీక్షలో వ్యక్తం చేశారని సమాచారం.

  రేపు మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థి పేరుతో పాటు చండూరులో ఏర్పాటు చేయబోయే సభ తేదీని, అలాగే అభ్యర్థి నామినేషన్ వేయాల్సిన తేదీని కూడా కేసీఆర్ ఖరారు చేయనున్నట్టు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ దాఖలకు మరింత గడువు ఉండటంతో.. ఆలోగా కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందనే విశ్వాసాన్ని కేసీఆర్ వ్యక్తం చేసినట్టు సమాచారం. కొత్త పార్టీ పేరుతో మునుగోడు ఉప ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించడం ద్వారా తన కొత్త జాతీయ పార్టీకి తొలి విజయాన్ని అందించినట్టు అవుతుందనే భావనలో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది.

  మరోవైపు రేపు జాతీయ పార్టీ పేరు ప్రకటన ఉన్నప్పటికీ.. మునుగోడు ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు దీనిపైనే టీఆర్ఎస్ నాయకత్వం ఫోకస్ ఉండబోతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తేనే.. జాతీయ పార్టీని దేశంలోని ఇతర రాష్ట్రాలు, ఇతర పార్టీల ముందుకు సగర్వంగా తీసుకెళ్లేందుకు అవకాశం కలుగుతుందని.. అలా జరగని పక్షంలో తాము అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం కష్టమనే భావనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది.

  KCR | TRS : కేసీఆర్ ప్రధాని కావాలంటూ .. మద్యం,కోళ్లు పంచిన టీఆర్ఎస్‌ నేత ..ఎక్కడో తెలుసా..?

  Munagodu: మునుగోడు ఉపఎన్నిక బాధ్యత వాళ్లిద్దరికే అప్పగింత .. కేసీఆర్‌ ప్లాన్‌ వర్కవుటయ్యేనా..?

  అందుకే రేపు జాతీయ పార్టీని ప్రకటించి.. ఆ తరువాత మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపైనే టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని.. ఎల్లుండి నుంచి టీఆర్ఎస్ నేతలు, శ్రేణులంతా మునుగోడు బాట పట్టాలని కేసీఆర్ ఆదేశించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని కేసీఆర్ నేతలకు చెప్పబోతున్నట్టు సమాచారం.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Munugodu By Election, Telangana

  ఉత్తమ కథలు