హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS: టీఆర్ఎస్‌కు ఎన్నికల గుర్తుల టెన్షన్.. ఆ సింబల్స్ ఎవరికీ ఇవ్వొద్దని ఈసీకి రిక్వెస్ట్..

TRS: టీఆర్ఎస్‌కు ఎన్నికల గుర్తుల టెన్షన్.. ఆ సింబల్స్ ఎవరికీ ఇవ్వొద్దని ఈసీకి రిక్వెస్ట్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TRS: వచ్చే నెలలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న అధికార టీఆర్ఎస్.. ఎన్నికల్లో తమకు ఇబ్బంది కలిగించే అంశాలుగా మారే ఛాన్స్ ఉన్న వాటిపై ముందుగానే ఫోకస్ చేసింది. ఈ క్రమంలో కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను అభ్యర్థులెవరికీ కేటాయించవద్దని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేసింది. తమ పార్టీ గుర్తు అయిన కారు గుర్తును పోలి ఉన్న 8 గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని తెలంగాణ(Telangana) రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను కోరారు. ఆ జాబితాను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని సూచించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత‌లు మీడియాతో మాట్లాడారు. కారును పోలిన గుర్తులను ఇత‌ర అభ్యర్థులకు కేటాయిస్తుండ‌టంతో త‌మ పార్టీని న‌ష్టం జ‌రుగుతోంద‌ని తెలిపారు. గ‌తంలో ఇలాగే కారును పోలిన గుర్తుల కార‌ణంగా టీఆర్ఎస్‌కు(TRS) ఓటు వేయాల‌నుకున్న వారు కూడా ఆ గుర్తుల‌కు ఓటేశార‌ని, ఫ‌లితంగా త‌మ పార్టీ ఖాతాలో ప‌డాల్సిన ఓట్లు... కారును పోలిన గుర్తు క‌లిగిన అభ్యర్థులకు పడ్డాయని అన్నారు.

ఈ త‌ర‌హా ప‌రిస్థితి పున‌రావృతం కాకుండా ఉండేలా కారును పోలిన గుర్తును ఫ్రీ సింబ‌ల్స్ జాబితా నుంచి తొల‌గించాల‌ని కోరినట్టు తెలిపారు. నిజానికి ఈ రకమైన సమస్య చాలాకాలం నుంచి వేధిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లోనూ పలుసార్లు ఎన్నికల గుర్తు కారణంగా స్థానాలను కోల్పోయింది టీఆర్ఎస్ . టీఆర్ఎస్‌పై ప్రత్యర్థి పార్టీలకు వచ్చిన ఓట్ల కంటే కారు గుర్తును పోలిన గుర్తులపై పోటీ చేసిన అభ్యర్థులకు అధిక ఓట్లు పోలయ్యాయి.

ఈ అంశంపై గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిశారు. కారు గుర్తులను పోలిన పలు గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని కోరారు. అయితే అప్పట్లో ఆయన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. దీంతో తాజాగా మునుగోడు(Munugodu) ఉప ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన విజ్ఞప్తిపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.

Telangana politics: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో క్షుద్రపూజలు చేసినట్లు బండి సంజయ్‌కి చెప్పిన ఆ స్వామీజీ ఎవరూ..?

Ts congress | Munugodu :మునుగోడు ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరం .. సరైన కారణంతో సైడ్ అవుతున్న ఎంపీ

వచ్చే నెలలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఎన్నికల గుర్తుల విషయంలో ప్రధాన పార్టీలు చాలా సీరియస్‌గా ఉన్నాయి. అందుకే కొన్ని ఫ్రీ గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరింది. మొత్తానికి ఎన్నికల గుర్తు విషయంలో టీఆర్ఎస్ ముందు జాగ్రత్త.. ఆ పార్టీకి ఏ మేరకు లాభిస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

First published:

Tags: Munugodu By Election, Telangana

ఉత్తమ కథలు