తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మునుగోడు గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ కూడా కొద్దిరోజుల నుంచి వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అక్కడ టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతుండటమే. అయితే ఉన్నట్టుండి అక్కడ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ రాజకీయ యుద్ధం ఎందుకు మొదలైందనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతేడాది తెలంగాణ రాజకీయమంతా దాదాపుగా హుజూరాబాద్ చుట్టూనే తిరిగింది. ఇందుకు ప్రధాన కారణం అక్కడ జరిగిన ఉప ఎన్నికే. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీమంత్రి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు.
అయితే ఆ తరువాత మళ్లీ హుజూరాబాద్ గురించి ఎక్కడా చర్చ జరగలేదు. టీఆర్ఎస్ కూడా హుజూరాబాద్ మీద పెద్దగా ఫోకస్ చేసిన దాఖలాలు కనిపించలేదు. అయితే ఉన్నట్టుండి హుజూరాబాద్‌లో కొద్దిరోజుల నుంచి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు(Etela Rajendar) సవాల్ విసురుతున్నారు. హుజూరాబాద్(Huzurabad) అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి హుజూరాబాద్‌లో ఈ రకమైన సవాళ్ల పర్వం మొదలుకావడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందనే వాదన వినిపిస్తోంది.
కొంతకాలంగా తాను కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్ స్థానం నుంచి పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ అధినాయకత్వం నుంచి ఆయనకు అనుమతి వచ్చిందో లేదో తెలియదు కానీ... గజ్వేల్‌లో పోటీ చేసే విషయంలో మాత్రం తన నిర్ణయం మారదన్నట్టుగా ఆయన కామెంట్స్ ఉన్నాయి.
ఈటల రాజేందర్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న టీఆర్ఎస్ నాయకత్వం.. ఆయనకు హుజూరాబాద్‌లో చెక్ పెట్టడం ద్వారా ఆయన గజ్వేల్‌పై ఫోకస్ చేయకుండా చేయాలనే ఆలోచనకు వచ్చినట్టు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య రాజకీయం యుద్ధం మొదలైందని పలువురు చర్చించుకుంటున్నారు. హుజూరాబాద్‌లో తన కేడర్‌ను కాపాడుకోవడంపై దృష్టి సారించాల్సిన పరిస్థితి వస్తే.. ఈటల రాజేందర్ గజ్వేల్‌పై ఫోకస్ చేసే పరిస్థితి ఉండదని టీఆర్ఎస్ యోచిస్తోందని.. అందుకే ఆయనను హుజూరాబాద్‌లో టార్గెట్ చేస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.