తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలు ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. ఇందుకోసం ఇప్పటి నుంచే సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్(Mahbubnagar)జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న టీఆర్ఎస్ను దెబ్బకొట్టాలని.. ఉమ్మడి జిల్లాలో బీజేపీ(BJP) మెజార్టీ స్థానాలు దక్కించుకునేలా చేయాలన్నదే బండి సంజయ్(Bandi Sanjay) పాదయాత్ర ప్రధాన ఉద్దేశ్యం. పాదయాత్రకు ముందే జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసిన బీజేపీ నాయకత్వం.. పాదయాత్రలో బండి సంజయ్ ఆ సమస్యలను ప్రస్తావించేలా ప్లాన్ చేశారు.
మరోవైపు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా స్థానికంగా నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ నేతలు గట్టిగానే ప్రయత్నించారని సమాచారం. అయితే ఈ విషయంలో బండి సంజయ్కు టీఆర్ఎస్ నాయకత్వం ఊహించని విధంగా షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బండి సంజయ్ మొదటి విడత పాదయాత్ర సందర్భంగా పలువురు స్థానిక టీఆర్ఎస్ నాయకులు బీజేపీలోకి వెళ్లడంతో ఆ పార్టీ అప్రమత్తమైంది.
దీంతో పాలమూరులో స్థానిక నేతలు బీజేపీ వైపు వెళ్లకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా నేతలకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా ఆ పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్న టీఆర్ఎస్(TRS)నేతలను గుర్తించి.. వాళ్లు పార్టీ మారకుండా చూడటంలో గులాబీ నేతలు సక్సెస్ అయ్యారని సమాచారం. అంతేకాదు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనే.. స్థానిక బీజేపీ నేతలను టీఆర్ఎస్లో తమ పార్టీలో చేర్చుకున్నట్టు తెలుస్తోంది.
TS Politics: తెలంగాణ మాజీమంత్రి మళ్లీ డైలమాలో పడిపోయారా ? ఎటూ తేల్చుకోలేకపోతున్నారా ?
పాదయాత్ర సందర్భంగా పార్టీలో పెద్దగా చేరికలు లేకపోవడంపై బండి సంజయ్ స్థానిక నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే టీఆర్ఎస్ పక్కాగా ప్లాన్ చేయడం వల్లే.. ఈసారి బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా బీజేపీలో పెద్దగా చేరికలు లేకుండాపోయాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ టార్గెట్గా బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటే.. బీజేపీకి షాక్ ఇచ్చేందుకు ఏం చేయాలనే దానిపై టీఆర్ఎస్ కూడా గట్టిగానే ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.