TS POLITICS TRS REVERSE OPERATION AKARSH ON BJP LEADERS TO TARGET THEM IN TELANGANA AK
TRS Versus BJP: టీఆర్ఎస్ రివర్స్ ఆపరేషన్ మొదలుపెట్టిందా ?.. బీజేపీకి ధీటుగా..
కేసీఆర్, బండి సంజయ్(ఫైల్ ఫోటో)
TRS Versus BJP: కొద్దిరోజులుగా తెలంగాణలో చేరికలను ప్రొత్సహించే విషయంలో కాంగ్రెస్ కాస్త ముందుంటోంది. ఇతర పార్టీలు, అందులోనూ టీఆర్ఎస్లోని నేతలపై ఆకర్ష్ మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
తెలంగాణ రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఎక్కువగా ఫోకస్ చేయడంతో.. ఇక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణలో (Telangana) ఎలాగైనా బీజేపీ జెండా ఎగరేలా చేయడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుండటంతో.. దాన్ని అడ్డుకునే క్రమంలో అధికార టీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు సాగుతుందనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ వ్యవహరాంలో ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. తాజాగా బీజేపీకి(BJP) చెందిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు కొందరు, ఇతర మున్సిపాలిటీలకు చెందిన నాయకులు కేటీఆర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ(PM Modi) హైదరాబాద్ వస్తున్న సమయంలో బీజేపీ కార్పరేటర్లు టీఆర్ఎస్లో చేరడం ఆసక్తిని రేకెత్తించే పరిణామం.
నిజానికి కొంతకాలంగా తెలంగాణ విషయంలో బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతుంటే.. టీఆర్ఎస్ మాత్రం కాస్త సైలెంట్‌గా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. బీజేపీని ఎదుర్కొనే వ్యూహాన్ని టీఆర్ఎస్ ఇంకా సిద్ధం చేసుకోలేదేమో అనే చర్చ కూడా సాగింది. అయితే తాజాగా బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరికలు చూసిన రాజకీయవర్గాలు.. టీఆర్ఎస్ నేతలు బీజేపీపై రివర్స్ ఆపరేషన్ మొదలుపెట్టారేమో అని చర్చించుకుంటున్నారు. నిజానికి తెలంగాణలో బలపడేందుకు వలసలను ప్రొత్సహించాలని బీజేపీ భావించింది. టీఆర్ఎస్లోని అసంతృప్తి నేతలను గుర్తించి తమ పార్టీలో చేర్చుకుని ఆ పార్టీని టార్గెట్ చేయాలని యోచిస్తోంది.
అయితే ఈ విషయాన్ని టీఆర్ఎస్ ముందుగానే గుర్తించి.. బీజేపీకి ఈ విషయంలో రివర్స్ కౌంటర్ ఇచ్చిందని పలువురు భావిస్తున్నారు. టీఆర్ఎస్లో అసంతృప్తి పెరుగుతున్న విధంగానే.. తెలంగాణలో బలపడుతున్న బీజేపీలోనూ అసంతృప్తి నేతల సంఖ్య పెరుగుతోంది. పార్టీలోకి కొత్తవారు వస్తుండటంతో.. అక్కడ ఉంటున్న పాత నేతలు చాలామంది తమకు ప్రాధాన్యత తగ్గుతోందనే భావనలో ఉంటున్నారు. అలాంటి నాయకులనే టీఆర్ఎస్ టార్గెట్‌గా చేసుకుని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోందనే వాదన వినిపిస్తోంది.
కొద్దిరోజులుగా తెలంగాణలో చేరికలను ప్రొత్సహించే విషయంలో కాంగ్రెస్ కాస్త ముందుంటోంది. ఇతర పార్టీలు, అందులోనూ టీఆర్ఎస్లోని నేతలపై ఆకర్ష్ మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అయితే కాంగ్రెస్‌లోకి వెళ్లే నేతల విషయంలో టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అదే సమయంలో బీజేపీలోని నేతలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.