హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana:మా ధాన్యం కొనకపోతే మీకు నూకలు చెల్లుతాయి కేంద్రానికి టీఆర్‌ఎస్ వార్నింగ్

Telangana:మా ధాన్యం కొనకపోతే మీకు నూకలు చెల్లుతాయి కేంద్రానికి టీఆర్‌ఎస్ వార్నింగ్

(టీఆర్‌ఎస్‌ నిరసన దీక్షలు)

(టీఆర్‌ఎస్‌ నిరసన దీక్షలు)

Telangana:అన్నదాతల కోసం టీఆర్‌ఎస్‌ చేస్తున్న పోరాటం మరింత ఉధృతం చేసింది. రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనంటూ మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టారు ఆపార్టీ శ్రేణులు. కేంద్రం వడ్లు కొనుగోలు చేయకపోతే బీజేపీకి నూకలు చెల్లుతాయని హెచ్చరించారు నేతలు.

ఇంకా చదవండి ...

తెలంగాణ(Telangana)లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని తప్పుపడుతూ టీఆర్‌ఎస్‌(TRS) పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. అందులో భాగంగానే సోమవారం(Monday) రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టారు పార్టీ నాయకులు, శ్రేణులు. కేంద్రం తెలంగాణ రైతుల దగ్గరున్న వరి పంట కొనకపోతే బీజేపీ(BJP) ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని దీక్షల్లో పాల్గొన్న మంత్రులు కేంద్రాన్ని హెచ్చరించారు. పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త దీక్షలో భాగంగా ఖమ్మం (Khammam) నియోజకవర్గం రఘునాథపాలెం (Raghunathpalem)మండలం మంచుకొండ ప్రధాన రహదారిపై మండల పార్టీ అద్వర్యంలో చేపట్టిన ఆందోళనలో తెలంగాణ రావాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్( Puvada Ajaykumar)పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి కేంద్రం తీరుపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రం కొనాలని డిమాండ్ చేశారు. బిజెపి ఢిల్లీ(Delhi)లో ఒకమాట గల్లీలో ఒకమాట మాట్లాడుతుందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే వక్రబుద్దిని రైతులపై చూపించడం సిగ్గు చేటన్నారు మంత్రి పువ్వాడ. దేశంలో విపత్కర పరిస్థితులు వస్తే కేంద్రం ఆహార నిల్వల్ని రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి పెట్టాలని రాజ్యాంగ బద్దంగా ఉన్న విషయమని అది కూడా బీజేపీ పాలకులకు తెలియకపోవడం విచారకరమన్నారు. ధాన్యం కొనుగోలు విషయంపై ఢిల్లీకి వెళ్లి మంత్రుల బృందం పీయూష్ గోయల్‌(Piyush Goyal‌)ని కలిస్తే అవమానకరంగా మాట్లారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలావాటు చేయమని చెప్పడం బాధకరమని చెప్పారు పువ్వాడ అజయ్. ప్రతి వరి గింజ కొనే బాధ్యత కేంద్రానిది అని చెప్పిన బండి సంజయ్(Bundy Sanjay), కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)ఎందుకు ఇప్పుడు మాట్లాడరని ప్రశ్నించారు.

తెలంగాణలో వరిపోరు..

అటు కరీంనగర్ జిల్లాలో కూడా టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన దీక్షలతో హోరెత్తించారు. జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో మంత్రి గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం వరి ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదేనన్న మంత్రి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే బీజేపీకి నూకలు చెల్లుతాయని హెచ్చరించారు గంగుల.

మీకు రైతులపై ప్రేమ ఉంటే..

నిజంగా బండి సంజయ్‌కి తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే వరి ధాన్యం కొనుగోలు చేసే విధంగా కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. వరిపోరులో భాగంగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నేతలు చేపట్టిన మండల కేంద్రాల్లో నిరసన దీక్షల్లో లక్షలాది మంది పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు పాల్గొన్నారు. మంత్రి హరీష్‌రావు పిలుపు మేరకు సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట ఆర్డీవో ఆఫీస్ వద్ద, నంగునూర్ ,చిన్నకోడూరు మండల కేంద్రం లోని ఎమ్మర్వో ఆఫీస్ ల వద్ద, నారాయణ రావు పేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లీ చౌరస్తా లో నిరసన దీక్షలు చేపట్టారు. సిద్దిపేట ఆర్భన్ రూరల్ మండలాల్లో నిరసన దీక్షలో రైతులు, రైతుసంఘాల నాయకులు సర్పంచ్‌లు పాల్గొన్నారు.

(టీఆర్‌ఎస్‌ నిరసన దీక్షలు)

కేంద్రంపై మలివిడత ఉద్యమం..

కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ ఉద్యమ పంథాలోనే .. రైతన్నల కోసం మరో ఉద్యమం కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలో పండించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేసే వరకూ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు గులాబీనేతలు. కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 8న అన్ని గ్రామాల్లో ప్రతి రైతు ఇంటి పైన నల్ల జెండా ఎగరా వేస్తామన్నారు. 11న కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టే దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగిరావాలన్నారు టీఆర్‌ఎస్‌ నేతలు.

Published by:Siva Nanduri
First published:

Tags: Bjp, Telangana, TRS leaders

ఉత్తమ కథలు