హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR: మునుగోడుపై తేల్చేసిన కేసీఆర్.. ఆ తరువాతే అభ్యర్థి ప్రకటన ?

KCR: మునుగోడుపై తేల్చేసిన కేసీఆర్.. ఆ తరువాతే అభ్యర్థి ప్రకటన ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR| Munugodu: మరోవైపు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే నేతలతో చర్చలు జరిపి వారిని సముదాయించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని కేసీఆర్ కోరినట్టు సమాచారం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమైన కేసీఆర్.. ఈ రోజు అభ్యర్థిని ప్రకటిస్తారనే చర్చ జరిగింది. కానీ అభ్యర్థి ప్రకటన విషయంలో కేసీఆర్ మరోసారి వేచి చూసే ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును మునుగోడు(Munugodu) అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసిన కేసీఆర్ (KCR) .. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాతే అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమైన అనంతరం సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో(Jagadish Reddy) ఈ అంశంపై సమాలోచనలు జరిపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని ఆయన జగదీశ్ రెడ్డికి స్పష్టం చేశారని.. అప్పటివరకు పార్టీ లైన్‌లోనే ఎన్నికల ప్రచారం చేయాలని ఆయనను ఆదేశించారని టీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మరోవైపు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే నేతలతో చర్చలు జరిపి వారిని సముదాయించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని కేసీఆర్ కోరినట్టు సమాచారం. ఇందుకోసం నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని.. ఇందులో కేడర్‌ను కూడా భాగస్వామ్యం చేయాలని కేసీఆర్ టీఆర్ఎస్ నేతలకు సూచించినట్టు టాక్. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పలు మండలాల్లో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు.

పార్టీ నాయకత్వం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును అభ్యర్థిగా ఖరారు చేసిందని.. ఈ విషయంలో ఎవరూ ఎలాంటి అభ్యంతరాలు పెట్టాల్సిన అవసరం లేదని.. ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తనకు చెప్పవచ్చని జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి వారికి నచ్చజెబుతున్నారు. కేవలం నాయకులతోనే కాకుండా కార్యకర్తలతోనే జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు చర్చిస్తున్నారు. కచ్చితంగా మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరాలని.. అందుకోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు.

KCR | Munugodu : నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ భేటీ .. మునుగోడు అభ్యర్ధి ఎవరంటే..?

Rajanna Sircilla: సిరిసిల్ల చీరకు బ్రాండ్ ఇమేజ్.. బ్రాండ్ నేమ్ ఏంటో తెలుసా..?

ఇదిలా ఉంటే మునుగోడులో ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన తరువాత పర్యటించాలని.. చండూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం డిసైడయ్యింది. ఈ సభలో అభ్యర్థి పేరును ప్రకటించేలా గులాబీ బాస్ కేసీఆర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఉప ఎన్నిక అభ్యర్థుల ఎంపిక విషయంలో మిగతా పార్టీల కంటే ఎప్పుడూ ముందుండే కేసీఆర్.. మునుగోడు విషయంలో మాత్రం గతానికి భిన్నంగా వ్యవహరించడం రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతోంది.

First published:

Tags: CM KCR, Munugodu By Election

ఉత్తమ కథలు