హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందే కేసీఆర్‌కు బిగ్ షాక్..?

KCR: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందే కేసీఆర్‌కు బిగ్ షాక్..?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR: ఇంతకాలం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే టీఆర్ఎస్, ఐప్యాక్ మధ్య డీల్ కొనసాగుతూ వచ్చిందని.. తాజాగా ఈ అంశంపై స్పష్టత రావడంతో ఈ ఒప్పందం రద్దయినట్టు తెలుస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఆయన పార్టీకి చెందిన నాయకులు సైతం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని పదే పదే చెబుతున్నారు. ఇందుకోసం కేసీఆర్ అంతా సిద్ధం చేసుకున్నారని.. త్వరలోనే ఆయన తన జాతీయ పార్టీ (National Party) జెండా, అజెండాను త్వరలోనే ప్రకటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలోనే ఈ రకమైన వార్తలు వచ్చినా.. ఈసారి దసరా రోజునే కేసీఆర్(KCR) ఇందుకోసం ముహూర్తం ఖరారు చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) సారథ్యంలోని ఐప్యాక్‌తో టీఆర్ఎస్ తెగతెంపులు చేసుకున్నట్టు వార్తలు రావడం కొత్త చర్చకు తెరలేపుతోంది. తాము కేవలం తెలంగాణ వరకే పని చేస్తామని.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. దాని కోసం తాము పని చేయలేమని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేసినట్టు సమాచారం.

  అయితే కేవలం తెలంగాణ కోసమే ఐప్యాక్‌తో కలిసి పని చేయడానికి టీఆర్ఎస్ సుముఖంగా లేదని.. అందుకే ఆ సంస్థతో టీఆర్ఎస్ తెగతెంపులు చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే టీఆర్ఎస్‌తో ఐప్యాక్ తెగతెంపులు చేసుకోవడంతో.. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమే అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఇదే అంశంపై డైలమా నెలకొనడంతో టీఆర్ఎస్, ఐప్యాక్ మధ్య బంధం కొనసాగుతోందని.. అయితే తాజాగా ఈ విషయంలో కేసీఆర్ నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో.. ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని ఐప్యాక్ టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిందని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.

  మరోవైపు టీఆర్ఎస్, ఐప్యాక్ మధ్య చాలాకాలం నుంచి సంబంధాలు తెగిపోయాయని.. ఐప్యాక్ టీమ్ టీఆర్ఎస్ కోసం పని చేయడం మానేసి చాలాకాలమే అవుతుందని మరికొందరు చర్చించుకుంటున్నారు. కేసీఆర్, ప్రశాంత్ కిశోర్ మధ్య గ్యాప్ పెరగడంతో.. టీఆర్ఎస్, ఐప్యాక్ మధ్య కూడా దూరం పెరుగుతూనే వచ్చిందని టాక్. చివరకు అది తెగతెంపులు చేసుకునే వరకు వెళ్లిందని తెలుస్తోంది.

  KCR-Prashant Kishor: టీఆర్ఎస్‌తో ప్రశాంత్ కిశోర్ కటీఫ్.. అసలు కారణం అదేనా ?

  YS Sharmila : సంగారెడ్డి పాదయాత్రలో YSషర్మిల పంచ్‌లు ..కేసీఆర్, రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డిని ఏమన్నారంటే

  అయితే ఇంతకాలం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే టీఆర్ఎస్, ఐప్యాక్ మధ్య డీల్ కొనసాగుతూ వచ్చిందని.. తాజాగా ఈ అంశంపై స్పష్టత రావడంతో ఈ ఒప్పందం రద్దయినట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. వివిధ రాష్ట్రాల్లోని రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రశాంత్ కిశోర్, ఐప్యాక్ వంటి వారి అవసరం ఉంటుంది. తాజాగా వీరి మధ్య డీల్ రద్దు కావడంతో.. ఇందుకోసం కేసీఆర్ మరో సంస్థను ఎంపిక చేసుకుంటారా ? అనే చర్చ కూడా సాగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Prashant kishor, Telangana

  ఉత్తమ కథలు